Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2024: చరిత్ర సృష్టించిన ఢిల్లీ క్యాపిటల్స్..!

ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల టీమ్ చరిత్ర సృష్టించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే ముంబై ఇండియన్స్‌‌పై లక్ష్యాన్ని కాపాడుకొని విజయం సాధించిన తొలి జట్టుగా నిలిచింది. డబ్ల్యూపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ 29 పరుగుల భారీ తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది.

తద్వారా ముంబై ఇండియన్స్ డిఫెండ్ చేసిన తొలి జట్టుగా గుర్తింపు పొందింది. ఈ టోర్నీ చరిత్రలోనే డిఫెండింగ్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ మినహా మరే జట్టు డిఫెండ్ చేయలేదు.

Delhi Capitals becomes

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 192 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(33 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 69 నాటౌట్), మెగ్ లాన్నింగ్(38 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ముంబై బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, సైకా ఇషాక్, పూజా వస్త్రాకర్, హీలీ మాథ్యూస్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 163 పరుగులే చేసి ఓటమిపాలైంది. అమన్‌జోత్ కౌర్(27 బంతుల్లో 7 ఫోర్లతో 42), హీలీ మాథ్యూస్(17 బంతుల్లో 6 ఫోర్లతో 29) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. యస్తికా భాటియా(6), నాట్ సివర్ బ్రంట్(5), హర్మన్‌ప్రీత్ కౌర్(6) తీవ్రంగా నిరాశపరిచారు.

ఢిల్లీ బౌలర్లలో జెస్ జోనాస్సెన్(3/21) మూడు వికెట్లు తీయగా.. మరిజన్నే కాప్(2/37) రెండు వికెట్లు పడగొట్టింది. శిఖా పాండే, టిటాస్ సధు, రాధా యాదవ్ తలో వికెట్ తీసారు.

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే ముంబై ఇండియన్స్ చేతిలో 4 వికెట్లతో ఓడిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆ తర్వాత సంచలన ప్రదర్శనతో వరుసగా నాలుగు విజయాలు అందుకుంది.

యూపీ వారియర్స్‌ను 9 వికెట్లతో ఓడించిన ఢిల్లీ.. ఆర్‌సీబీ, గుజరాత్ జెయింట్స్‌పై 25 పరుగుల తేడాతో గెలిచింది. తాజా మ్యాచ్‌లో 29 పరుగులతో ముంబైని ఓడించింది.

Story first published: Tuesday, March 5, 2024, 23:25 [IST]
Other articles published on Mar 5, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+