Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2024: ప్చ్.. స్మృతి మంధాన చెలరేగినా ఆర్‌సీబీకి తప్పని పరాజయం!

వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జోరుకు బ్రేక్‌ పడింది. వరుసగా రెండు మ్యాచ్‌లు గెలిచి హ్యాట్రిక్‌పై కన్నేసిన ఆర్‌సీబీకి ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. సమష్టిగా రాణించి 25 పరుగుల తేడాతో ఆర్‌సీబీని ఓడించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. అలిస్ క్యాప్సీ(33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో మరిజన్నే కాప్(16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32), జెస్ జొనాస్సెన్(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 36 నాటౌట్)మెరుపులు మెరిపించారు.

WPL 2024: Delhi Capitals beat Royal Challengers Bangalore

ఆర్‌సీబీ బౌలర్లలో నడిన్ డి క్లర్క్, సోఫీ డివైన్ రెండేసి వికెట్లు తీయగా.. శ్రేయాంక పాటిల్ ఓ వికెట్ పడగొట్టింది. అనంతర లక్ష్యచేధనకు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 169 పరుగులు చేసి ఓటమిపాలైంది. స్మృతి మంధాన(43 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగినా.. మిగతా బ్యాటర్లు విఫలమవడంతో ఆర్‌సీబీకి ఓటమి తప్పలేదు.

ఢిల్లీ బౌలర్లలో మరిజన్నే కేప్, తెలుగు తేజం అరుంధతి రెడ్డి రెండేసి వికెట్లు తీయగా.. జెస్ జోనాస్సెన్ మూడు వికెట్లు పడగొట్టింది. శిఖా పాండేకు ఓ వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌కు ఆర్‌సీబీ స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్రీ దూరంగా ఉంది. అనారోగ్యం కారణంగా ఆమె ఈ మ్యాచ్‌కు దూరమైందని టాస్ సందర్భంగా కెప్టెన్ స్మృతి మంధాన తెలిపింది. ఎల్లిస్ పెర్రీ లేని లోటు ఈ మ్యాచ్‌లో కనిపించింది.

Story first published: Thursday, February 29, 2024, 23:02 [IST]
Other articles published on Feb 29, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+