WPL 2024 Auction: స్టార్ ప్లేయర్లకు చుక్కెదురు.. అన్‌సోల్డ్ లిస్ట్ ఇదే!
WPL 2024 Auctionలో స్టార్ ప్లేయర్లకు చుక్కెదురైంది. శనివారం ముంబై వేదికగా జరిగిన డబ్ల్యూపీఎల్ 2024 మినీ వేలంలో ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లపై కోట్లు కుమ్మరించారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటే అంతర్జాతీయ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న పలువురి స్టార్ ప్లేయర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.
తమకు అవసరమైన అనామక ప్లేయర్ల కోసం మాత్రం భారీగా ఖర్చు చేశాయి. ఈ వేలంలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ సదర్లాండ్, భారత అనామక ప్లేయర్ కాశ్వీ గౌతమ్ రూ. 2 కోట్ల భారీ ధర పలికారు. అయితే శ్రీలంక స్టార్ చమరి ఆటపట్టుతో పాటు దియాంద్ర డాటిన్, తారా నోరిస్, కిమ్ గార్త్, దేవికా వైద్యలను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

గతేడాది రూ. 1.4 కోట్లు..
భారత స్టార్ ప్లేయర్ దేవికా వైద్యది విచిత్రకర పరిస్థితి. గతేడాది రూ. 1.40 కోట్ల భారీ ధర పలికిన ఆమెను ఈ సారి ఎవరూ పట్టించుకోలేదు. అరంగేట్ర సీజన్ కోసం యూపీ వారియర్స్ ఆమెకు భారీ ధర చెల్లించి తీసుకుంది. కానీ ఆమె అంచనాలను అందుకోలేకపోయింది 77 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచింది. బౌలింగ్‌లోనూ ఒక్క వికెటే పడగొట్టింది. దాంతో ఆమెను యూపీ వారియర్స్ వదులుకుంది. దేశవాళీ టోర్నీలో సత్తా చాటిన ఆమె 6 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు పడగొట్టింది. దాంతో ఆమె భారీ ధర పలుకుతుందని అంతా అనుకున్నారు. కానీ ఫ్రాంచైజీలు ఆమె వైపు కన్నెత్తి చూడలేదు.
కిమ్ గార్త్: ఆస్ట్రేలియాకు చెందిన కిమ్ గార్త్‌ను కూడా ఎవరూ పట్టించుకోలేదు. రూ. 50 లక్షల కనీస ధరతో ఆమె వేలంలోకి రాగా.. ఫ్రాంచైజీలు ఆసక్తి కనబర్చలేదు. 55 అంతర్జాతీయ టీ20ల ఆడిన అనుభవం ఉన్నా ఆసక్తి చూపలేదు.

తారా నోర్రిస్..
అమెరికాకు చెందిన తారా నోర్రిస్‌ను సైతం ఎవరూ పట్టించుకోలేదు. రూ. 10 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్నా ఎవరూ తీసుకోలేదు. గతేడాది ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడిన ఆమె తన బౌలింగ్‌తో ఆకట్టుకుంది. ఐదు మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీయడంతో పాటు డబ్ల్యూపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల ఘనత అందుకున్న తొలి బౌలర్‌గా నిలిచింది.
చమరి ఆటపట్టు: శ్రీలంక కెప్టెన్ చమరి ఆటపట్టును కూడా ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. రూ. 50 లక్షల కనీస ధరతో అందుబాటులో ఉన్న ఆమెను కొనుగోలు చేసేందుకు ఐదు జట్లు ఆసక్తి కనబర్చలేదు. మహిళల బీబీఎల్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చినా.. పరిగిణలోకి తీసుకోలేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications