Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2024 Auction: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌కు అదిరిపోయే ధర.. ఎన్ని కోట్లంటే..?

WPL 2024 Auction‌లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ పంట పడింది. ముంబై వేదికగా శనివారం జరిగిన వేలంలో ఈ ఆసీస్ యువ ఆల్‌రౌండర్‌పై కాసుల వర్షం కురిసింది. రూ. 40 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన సదర్లాండ్‌ను రూ. 2 కోట్ల భారీ ధరకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

సదర్లాండ్‌ను కొనుగోలు చేసేందుకు ఢిల్లీతో పాటు ముంబై ఇండియన్స్ పోటీపడింది. దాంతో ఆమె ధర అమాంతం పెరిగిపోయింది. ఢిల్లీ దూకుడుకు ముంబై ఇండియన్స్ వెనక్కి తగ్గింది. డబ్ల్యూపీ‌ఎల్ అరంగేట్ర సీజన్‌లో సదర్లాండ్ గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించింది. అప్పుడు ఆమెను రూ. 70 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుగోలు చేసింది.

WPL 2024 Auction: Australia All-rounder Annabel Sutherland bags 2Cr deal

అరంగేట్ర సీజన్‌లో సదర్లాండ్ ఆశించిన రీతిలో రాణించకపోవడంతో గుజరాత్ జెయింట్స్ వదిలేసింది. వారు వదిలేయడం ఈ ఆసీస్ ఆల్‌రౌండర్‌కు కలిసొచ్చింది. సదర్లాండ్స్ ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. ఇటీవల ముగిసిన మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో సదర్లాండ్స్ 304 పరుగులతో పాటు 21 వికెట్లు పడగొట్టింది.

సదర్లాండ్స్‌తో పాటు భారత అనామక ప్లేయర్ కాశీవ్ గౌతమ్‌ రూ. 2 కోట్ల ధర భారీ ధర పలికింది. రూ. 10 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన కాశీవ్ గౌతమ్‌ను గుజరాత్ జెయింట్స్ రూ. 2 కోట్ల పెట్టి కొనుగోలు చేసింది.

మరో అనామక ప్లేయర్ వ్రిందా దినేష్‌ను యూపీ వారియర్స్ రూ. 1.3 కోట్లకు కొనుగోలు చేసింది. టీమిండియా ప్లేయర్ ఎక్తా బిష్త్‌ను ఆర్‌సీబీ రూ. 60 లక్షలకు సొంతం చేసుకుంది. ఇక అన్నేబెల్ సదర్లాండ్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ రూ. 2 కోట్లకు కొనుగోలు చేసింది.

ఐదు జట్లలో గరిష్టంగా 30 స్థానాలు ఖాళీగా ఉండగా.. మొత్తం 165 మంది అమ్మాయిలు వేలం రేసులో నిలిచారు. ఇందులో 104 మంది భారత క్రికెటర్లు ఉండగా.. 61 మంది విదేశీయులు, అంతర్జాతీయ క్రికెటర్లు 56 మంది ఉన్నారు. ఐదు జట్లలో విదేశీ ఆటగాళ్ల స్థానాలు 9 ఉండగా.. ఒక్కో జట్టులో గరిష్టంగా 18 మంది మాత్రమే ఉండాలి.

Story first published: Saturday, December 9, 2023, 17:34 [IST]
Other articles published on Dec 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+