WPL 2023: వరుస ఓటములు.. కన్నీటి పర్యంతమైన స్మృతి మంధాన!

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. వరుసగా ఆ జట్టు నాలుగో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. యూపీ వారియర్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ చిత్తయ్యింది. వరుస పరాజయాలతో ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన కన్నీటి పర్యంతమైంది. వరుస ఓటములకు తనదే బాధ్యతని పేర్కొంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మృతి మంధాన.. బ్యాటింగ్ వైఫల్యమే వరుస పరాజయాలకు కారణమని చెప్పింది.
'గత నాలుగు మ్యాచ్‌లుగా ఇదే ఫలితం ఎదురవుతోంది. ప్రతీ మ్యాచ్‌లో మంచి ఆరంభం లభించినప్పటికి.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతున్నాం. ఇది మ్యాచ్ ఫలితాలపై ప్రభావం చూపిస్తోంది. మా గేమ్ ప్లాన్ సరిగ్గా లేకపోవడంతోనే వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలయ్యాం. ఈ వరుస పరాజయాలకు పూర్తి బాధ్యత నాదే.
ఒక బ్యాటర్‌గా నేను పూర్తిగా విఫలమయ్యా. నాతో సహా టాపార్డర్ బ్యాటింగ్ మెరుగుపడాల్సి ఉంది. వరుస ఓటములతో గడిచిన వారం మాకు చాలా కఠినంగా అనిపించింది. నా కుటుంబం ఎప్పుడు నాకు మద్దతుగా ఉంటుంది. ఓటములకు గల కారణాలను తెలుసుకొని సరిదిద్దుకుంటాం. మెరుగైన ప్రదర్శన కోసం ప్రయత్నిస్తాం'అని స్మృతి చెప్పుకొచ్చింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 19.3 ఓవర్లలో 138 పరుగులకే కుప్పకూలింది. ఎలిస్ పెర్రీ హాఫ్ సెంచరీతో చెలరేగగా..
సోఫి డివైన్ 36 పరుగులతో రాణించింది. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. యూపీ వారియర్స్ బౌలర్లలో ఎక్లిస్టోన్ నాలుగు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ మూడు వికెట్లు పడగొట్టింది. అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్ 13 ఓవర్లలోనే వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ అలిస్సా హీలీ (47 బంతుల్లో 18 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 96 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడగా.. దేవికా వైద్య 36 పరుగులతో అండగా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications