Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023: వరుసగా 5 ఓటములు.. అయినా ఆర్‌సీబీకి ఎలిమినేటర్ చాన్స్! ఎలా అంటే..?

 WPL 2023: RCB can still qualify for the WPL eliminator after fifth consecutive loss

హైదరాబాద్: టీమ్ నిండా స్టార్ ప్లేయర్లు.. పేపర్‌పై అత్యంత బలమైన జట్టు.. కానీ ఇప్పటి వరకు బోణీకొట్టలేదు. పేలవ ఆట తీరుతో వరుసగా 5 మ్యాచ్‌ల్లో చిత్తయ్యింది. బ్యాటింగ్ చేస్తే బౌలింగ్.. బౌలింగ్‌లో రాణిస్తే బ్యాటింగ్ వైఫల్యంతో ఆ జట్టు విఫలమవుతోంది. పురుషుల టీమ్ దరిద్రం చుట్టుకుందో లేక.. ఆ పేరుకున్న మహిమో ఏమో కానీ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ).. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)‌లో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఇప్పటి వరకు ఒక్క విజయాన్ని నమోదు చేయలేకపోయింది. క్రికెట్ బ్యూటీ స్మృతి మంధాన ముఖంలో చిరునవ్వు కనుమరుగైంది.

ఢిల్లీ క్యాపిటల్స్‌తో సోమవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లోనూ ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. చివరి ఓవర్‌లో 9 పరుగులు డిఫెండ్ చేయలేక ఓటమికి తల వంచింది. 5 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో అట్టడుగు స్థానంలో నిలిచింది. అయితే ఇప్పటికీ టోర్నీలో ముందడుగు వేసే అవకాశం ఆర్‌సీబీకి ఉంది.

అయితే ఆ జట్టు చివరి మూడు మ్యాచ్‌లను గెలవడంతో పాటు ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్స్.. గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్‌పై విజయం సాధించాలి. అలాగే గుజరాత్ జెయింట్స్.. యూపీ వారియర్స్‌ను ఓడించాలి. అలా జరిగితే అట్టడుగు స్థానంలో ఉన్న ఆర్‌సీబీ.. టాప్-3లో చోటు దక్కించుకుంటుంది. టోర్నీ ఫార్మాట్ ప్రకారం టాప్ టీమ్ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించనుండగా.. రెండు, మూడో స్థానంలో నిలిచిన జట్టు ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతాయి.

ఇక ఆర్‌సీబీ తమ తదుపరి మ్యాచ్‌ల్లో యూపీ వారియర్స్(మార్చి 15), గుజరాత్ జెయింట్స్( మార్చి 18), ముంబై ఇండియన్స్( మార్చి 21)లతో తలపడనుంది. ఆర్‌సీబీ కెప్టెన్ స్మృతి మంధాన వైఫల్యం జట్టు విజయవకాశాలను దెబ్బ తీస్తోంది. కెప్టెన్సీ భారాన్ని ఆమె మోయలేకపోతుంది. మంధాన బ్యాట్ ఝులిపిస్తే ఆర్‌సీబీకి తిరుగుండదు. మంధాన వైఫల్యమే కాకుండా సమష్టితత్వం కూడా ఆర్‌సీబీ కొంపముంచుతోంది. ప్లేయర్లంతా సమష్టిగా రాణించలేకపోతున్నారు.

Story first published: Tuesday, March 14, 2023, 11:51 [IST]
Other articles published on Mar 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+