WPL 2023: దంచికొట్టిన నాట్ సీవర్.. యూపీ ముందు భారీ లక్ష్యం!

ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)2023లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరుగుతున్న ఎలిమినేటర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ చేసింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ నాట్ సీవర్(38 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 72 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 182 పరుగులు చేసింది.
నాట్ సీవర్‌కు తోడుగా హీలీ మాథ్యూస్(26 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 26), అమెలియా కేర్(19 బంతుల్లో 5 ఫోర్లతో 29) రాణించారు. యూపీ వారియర్స్ బౌలర్లలో సోఫీ ఎక్లీస్టోన్ రెండు వికెట్లు తీయగా.. తెలుగు అమ్మాయి అంజలి శర్వాణీ, పర్శవి చోప్రా తలో వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు సరైన ఆరంబం లభించలేదు. తెలుగు అమ్మాయి అంజలి శర్వాణీ వేసిన ఐదో ఓవర్‌లో ఓపెనర్ యస్తికా భాటియా(21) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. దాంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 46 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం ధాటిగా ఆడిన హీలీ మాథ్యూస్‌ను చోప్రా పెవిలియన్ చేర్చింది. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి నాట్ సీవర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లింది.
కానీ హర్మన్ ప్రీత్ కౌర్‌ను ఎక్లీస్టోన్ క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో క్రీజులోకి వచ్చిన అమెలియా కేర్, నాట్ సీవర్ ధాటిగా ఆడారు. ఈ ఇద్దరూ 6వ వికెట్‌కు 60 పరుగులు జోడించిన అనంతరం అమెలీయా కేర్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. క్రీజులోకి వచ్చిన పూజా వస్త్రాకర్(11 నాటౌట్) సాయంతో నాట్ సీవర్ జట్టుకు భారీ స్కోర్ అందించింది. ఈ వికెట్‌పై ముంబై విధించిన ఈ భారీ లక్ష్యాన్ని చేధించడం కష్టమే. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications