WPL 2023: పాపం త్రిష.. అప్పుడు లక్ష్మణ్.. ఇప్పుడు మిథాలీ! తెలుగు ప్లేయర్లకు ఒరిగిందేం లేదు!

హైదరాబాద్: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) వేలంలో భారత క్రికెటర్ల పంట పండింది. టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన అంచనాలకు మించి అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచింది. ఆమె కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లు వెచ్చించింది. ప్రతి జట్టు రూ.12 కోట్లతో వేలంలో అడుగుపెట్టగా... 409 మంది ప్లేయర్లలో 87 మందిని ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి.
తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్లేయర్లు మంచి ధర పలికారు. ప్రస్తుతం టీమిండియాకు ఆడుతున్న ఏపీ పేసర్ అంజలి శర్వాణిని రూ.55 లక్షలకు యూపీ వారియర్స్ దక్కించుకుంది. కనీస ధర రూ.30 లక్షలతో వేలంలోకి వచ్చిన ఆమెపై యూపీ ఆసక్తి చూపించింది.

తెలంగాణ అమ్మాయికి నిరాశ..
ఇటీవల అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టులో సభ్యులైన హైదరాబాద్ పేసర్ యషశ్రీ, విశాఖపట్నం పేసర్ షబ్నమ్‌ను కనీస ధర రూ.10 లక్షలకు వరుసగా యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్ సొంతం చేసుకున్నాయి. జాతీయ జట్టుకు ఆడిన హైదరాబాద్ పేసర్ అరుంధతి రెడ్డిని కనీస ధర రూ.30 లక్షలకు ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.
ఆంధ్ర బ్యాటర్ సబ్బినేని మేఘనను కనీస ధర రూ.30 లక్షలకు గుజరాత్ జెయింట్స్ కొనుక్కుంది. కానీ అండర్-19 ప్రపంచకప్‌లో మంచి ప్రదర్శన చేసిన భద్రాచలం అమ్మాయి గొంగడి త్రిష (కనీస ధర రూ.10 లక్షలు)ను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు.

ప్రపంచకప్‌లో రాణించినా..
అండర్ 19 ప్రపంచకప్‌లో అసాధారణ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన గొంగడి త్రిషను ఎవరూ తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగించింది. తొలి అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో 17 ఏళ్ల త్రిష 7 మ్యాచ్‌ల్లో 116 పరుగులతో రాణించింది. అందులో స్కాట్లాండ్‌పై ఓ అర్ధశతకమూ చేసింది. అవకాశం వచ్చిన ప్రతిసారి సత్తాచాటింది.
కీలకమైన ఫైనల్లో తీవ్ర ఒత్తిడిలోనూ గొప్పగా ఆడింది. దాంతో తొలి డబ్ల్యూపీఎల్‌లో త్రిషకు అవకాశం దక్కుతుందని భావించిన క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. రూ.10 లక్షల బేస్ ప్రైజ్‌కు తీసుకునేందుకు కూడా ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు.

ఆల్‌రౌండరని తెలియకపోవడమే..
ఫ్రాంచైజీలన్నీ ఆల్‌రౌండర్లపై ఎక్కువ ఫోకస్ పెట్టడంతో బ్యాటర్ల జాబితాలో ఉన్న త్రిషకు అవకాశం దక్కలేదు. అయితే త్రిష మంచి ఆల్‌రౌండర్ అని, లెగ్ స్పిన్ వేయగలదని ఆమె కోచ్ తెలిపినట్లు తెలుగు కామెంటేటర్ సీ వెంకటేశ్ తెలిపారు. ప్రపంచకప్‌లో ఆమె బౌలింగ్ చేస్తానని అడగకపోవడంతో త్రిష ఆల్‌రౌండ్ సామర్థ్యం ఫ్రాంచైజీలు గుర్తించలేకపోయాయని చెప్పారు. ప్రస్తుతం త్రిష వయసు 17 ఏళ్లేనని, ఆమెకు చాలా భవిష్యత్తు ఉందని వెంకటేశ్ చెప్పుకొచ్చారు.
క్రికెట్ అభిమానులు, తెలుగు స్పోర్ట్స్ జర్నలిస్ట్‌లు మాత్రం త్రిషను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఫ్రాంచైజీలకు తెలియకపోయినా.. గుజరాత్ జెయింట్స్ మెంటార్ మిథాలీ రాజ్ హైదరాబాద్ క్రికెటరేనని, గుజరాత్ జెయింట్స్ బ్యాటింగ్ కోచ్ నూషిన్ అల్ ఖదీర్ అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత అమ్మాయిల జట్టుకు హెడ్ కోచ్ గా వ్యవహరించిందని, వారికి త్రిష సామర్థ్యం తెలియదా? అని ప్రశ్నిస్తున్నారు.
జట్ల పేర్లు మాత్రం స్థానికంగా ఉంటాయని, కానీ జట్లలో మాత్రం స్థానిక క్రీడాకారులు ఉండరని మండిపడుతున్నారు. గతంలో వీవీఎస్ లక్ష్మణ్ సన్‌రైజర్స్ మెంటార్‌గా ఉండి తెలుగు ప్లేయర్లకు అన్యాయం చేశాడని, ఇప్పుడు మిథాలీ రాజ్ అని పెదవి విరుస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications