WPL 2023: వరుసగా 7 బంతుల్లో 7 బౌండరీలు.. హర్మన్‌ప్రీత్ సంచలనం!

న్యూఢిల్లీ: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)ను టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ సారథి హర్మన్‌ప్రీత్ (30 బంతుల్లో 14 ఫోర్లతో 65) ఘనంగా ప్రారంభించింది. గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. ఎదుర్కొన్న తొలి బంతి నుంచి గుజరాత్ బౌలర్లను అటాక్ చేసిన హర్మన్.. డబ్ల్యూపీఎల్ లీగ్‌లో తొలి హాఫ్ సెంచరీ అందుకుంది. ఐపీఎల్ తరహాలో మహిళలకు ఫ్రాంచైజీ లీగ్ కావాలని కలలు కన్న హర్మన్.. ఆ కల సాకారమైందనే ఆనందమో ఏమో కానీ ఆకాశమే హద్దుగా చెలరేగింది.
తనకే సాధ్యమైన ఆటతో వరుసగా ఏడు బంతుల్లో ఏడు బౌండరీలు నమోదు చేసింది. మోనికా పటేల్ వేసిన 15వ ఓవర్‌లో చివరి నాలుగు బంతులను బౌండరీకి తరలించిన హర్మన్.. గార్డనర్ వేసిన మరుసటి ఓవర్‌లో రెండో బంతికే స్ట్రైక్ తీసుకొని వరుసగా మరో మూడు బౌండరీలు బాదింది. దాంతో వరుసగా ఏడు బంతుల్లో ఏడు బౌండరీలతో 28 పరుగులు పిండుకుంది. స్వీప్ షాట్స్‌తో పాటు కట్, పుల్ షాట్లతో అభిమానులను ఆకట్టుకుంది. స్టెప్ ఔట్ అవుతూ మిడ్ వికెట్ మీదుగా ఆమె కొట్టిన బౌండరీలు మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచాయి.
హర్మన్‌ప్రీత్ విధ్వంసకర బ్యాటింగ్‌కు అండగా అమెలియా కేర్( 24 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), హెలీ మాథ్యూస్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. వారెహమ్, తనూజ కాన్వర్, అష్లే గార్డనర్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ జెయింట్స్ 5 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. అంతేకాకుండా కెప్టెన్ బెత్ మూనీ గాయంతో కరీజును వీడింది. ప్రస్తుతం క్రీజులో సదర్లాండ్, హేమలత ఉన్నారు. హర్లీన్ డియోల్(0), అష్లే గార్డ్‌నర్(0), సబ్బినేని మేఘన(2) దారుణంగా విఫలమయ్యారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications