Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్.. డబ్ల్యూపీఎల్.. ముంబై ఇండియన్స్‌దే జోరు!

WPL 2023: MI becomes only team to Fastest run chase and Biggest win in WPL and IPL

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) అయినా.. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అయినా ముంబై ఇండియన్స్‌ జోరు మాత్రం తగ్గట్లేదు. రోహిత్ శర్మ సారథ్యంలో ఇప్పటికే ఐదు టైటిళ్లు గెలిచి అగ్ర జట్టుగా నిలిచిన ముంబై.. మహిళల ప్రీమియర్ లీగ్‌లోనూ అదే ఆట తీరును కొనసాగిస్తోంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి అగ్రస్థానంలో నిలిచింది.

గుజరాత్ జెయింట్స్‌తో శనివారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో 143 పరుగుల భారీ తేడాతో గెలిచిన హర్మన్ సేన.. సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్‌ బెంగళూరును 9 వికెట్లతో చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యం చెలాయిస్తూ ప్రత్యర్థి జట్లను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.

అరుదైన ఘనత..

అరుదైన ఘనత..

జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా.. యువ ప్లేయర్లతోనే సత్తా చాటుతోంది. ఈ క్రమంలోనే ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓ యూనిక్ రికార్డును తమ పేరిట లిఖించుకుంది. ఐపీఎల్‌, డబ్ల్యూపీఎల్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా.. అత్యంత వేగంగా లక్ష్యాన్ని చేధించిన టీమ్‌గా ముంబై ఇండియన్స్ చరిత్రకెక్కింది.

ఐపీఎల్‌లో 146 పరుగులతో ముంబై ఇండియన్స్ భారీ విజయం సాధిస్తే.. డబ్ల్యూపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో హర్మన్‌సేన 143 పరుగులతో గుజరాత్ జెయింట్స్‌ను చిత్తు చేసింది. అలాగే ఐపీఎల్‌లో 5.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధిస్తే.. డబ్ల్యూపీఎల్ 14.2 ఓవర్లలో లక్ష్యాన్ని అధిగమించింది.

విండీస్ ప్లేయర్‌తో ముంబై లవ్ కంటిన్యూ ..

వేలంలో రూ.40 లక్షలకే కొనుగోలు చేసిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్ హేలీ మాథ్యూస్ ముంబైకి కీలకంగా మారింది. రెండు మ్యాచ్‌ల్లో ఆమె బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ సత్తా చాటింది. ఆర్‌సీబీ‌తో జరిగిన మ్యాచ్‌లో 77 పరుగులతో అజేయంగా నిలిచిన ఆమె.. బౌలింగ్‌లో మూడు కీలక వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది.

దాంతో ముంబై ఇండియన్స్, వెస్టిండీస్ ప్లేయర్లకు ఉన్న అనుబంధాన్ని అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు. కీరన్ పోలార్డ్ ఐపీఎల్‌లో ఎన్నో చిరస్మరణీయ విజయాలందించగా.. ఇప్పుడు మాథ్యూస్ అదే తరహాలో చెలరేగుతుందని కామెంట్ చేస్తున్నారు.

ముంబైదే ఆధిపత్యం..

ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున హాఫ్ సెంచరీతో పాటు మూడు వికెట్లు తీసింది కీరన్ పొలార్డ్ కాగా.. డబ్ల్యూపీఎల్‌లో హేలీ మాథ్యూస్ ఈ ఘనతను అందుకోవడం గమనార్హం. ప్రస్తుతానికి డబ్ల్యూపీఎల్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ముంబై.. టేబుల్ టాపర్‌గా నిలవడంతో పాటు బెస్ట్ రన్‌రేట్ కలిగి ఉంది. అంతేకాకుండా అత్యధిక పరుగులు( ఆరెంజ్ క్యాప్) చేసిన బ్యాటర్, అత్యధిక వికెట్లు(పర్పుల్ క్యాప్) తీసిన బౌలర్ కూడా ముంబై ప్లేయర్లే కావడం విశేషం.

Story first published: Tuesday, March 7, 2023, 14:49 [IST]
Other articles published on Mar 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+