WPL 2023: వరల్డ్ రిచెస్ట్ వుమెన్స్ లీగ్‌కు వేళాయరా?

ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)కు రంగం సిద్దమైంది. జట్ల బిడ్డింగ్‌తోనే సంచలనం సృష్టించిన ఈ లీగ్ ప్రసార హక్కులతో రికార్డులు బద్దలు కొట్టింది. వేలంలో అమ్మాయిలపై అనూహ్య రీతిలో రూ.కోట్ల వర్షం కురిపించి వరల్డ్ రిచెస్ట్ వుమెన్స్ క్రికెట్ లీగ్‌గా గుర్తింపు పొందింది. ఇలా ప్రతి అడుగు.. ప్రతి దశలోనూ అందరి దృష్టించిన ఆకర్షించిన డబ్ల్యూపీఎల్.. ఆరంభానికి ముందే భారీ అంచనాలను పెంచేసింది.

ముంబై X గుజరాత్..
ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్ జట్లు టీ20 సమరానికి సై అంటున్నాయి. ఈ నెల 26న జరిగే టైటిల్ ఫైట్‌లో గెలిచి డబ్ల్యూపీఎల్ మొట్టమొదటి సీజన్ విజేతగా నిలిచేందుకు ఈ ఐదు జట్లు సిద్దమయ్యాయి. శనివారం రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ముంబైలోని
డీవై పాటిల్ స్టేడియం ఈ ఆరంభ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తోంది.
ఈ సీజన్‌లో మ్యాచ్‌లన్నింటీకి ముంబైయిలోని డీవై పాటిల్‌తో పాటు బ్రబౌర్న్ స్టేడియం వేదికలుగా ఖరారు చేశారు. వయాకామ్18 సంస్థకు చెందిన స్పోర్ట్స్18 నెట్‌వర్క్‌లో మ్యాచ్‌లు ప్రసారమవుతాయి. జియో సినిమా యాప్‌లోనూ మ్యాచ్‌లను వీక్షించొచ్చు.

తెలుగు రాష్ట్రాల నుంచి..
ఈ లీగ్‌లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అంజలి శర్వాణి, యషశ్రీ (యూపీ), సబ్బినేని మేఘన, షబ్నమ్ (గుజరాత్), స్నేహ దీప్తి, అరుంధతి రెడ్డి (ఢిల్లీ) భాగమవ్వనుండగా.. ఈ అవకాశాలను ఏ మేరకు సద్వినియోగం చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారాయి.
డబ్ల్యూపీఎల్ జట్ల కోసం ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టిన మొత్తం రూ.4,669 కోట్లు. అత్యధికంగా గుజరాత్ జెయింట్స్ కోసం అదానీ గ్రూప్ రూ.1,289 కోట్లు ఖర్చు చేయడం విశేషం. వేలంలో క్రికెటర్ల కొనుగోలు కోసం ఫ్రాంఛైజీలు రూ.59.50 కోట్లు వెచ్చించాయి. అత్యధిక ధర పలికిన క్రికెటర్ స్మృతి మంధానను రూ.3.4 కోట్లకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. ఇప్పటికే అమెరికాలోని మహిళల ఎన్‌బీఏ తర్వాత ప్రపంచంలోనే రెండో ఖరీదైన లీగ్‌గా డబ్ల్యూపీఎల్ గుర్తింపు పొందింది.

అదిరిపోయే ఆరంభం..
ప్రతిష్మాతకంగా తీసుకున్న డబ్ల్యూపీఎల్ ఆరంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. మ్యాచ్ ప్రారంభానికి రెండు గంటల ముందే ఆరంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. బాలీవుడ్ అందాలు కియారా అద్వాణీ, కృతి సనన్ ఈ కార్యక్రమంలో ప్రదర్శన ఇవ్వనున్నారు. అలాగే ప్రముఖ గాయకుడు శంకర్ మహాదేవన్.. డబ్ల్యూపీఎల్ నేపథ్య గీతాన్ని ఆలపించనుండగా.. ప్రముఖ ర్యాపర్, గాయకుడు ఏపీ ధిల్లాన్ కూడా తన పాటతో హోరెత్తించనున్నాడు.

ఏ జట్టు ఎలా ఉందంటే..?
ఆర్‌సీబీ:
కెప్టెన్: స్మృతి మంధానా
కీలక ప్లేయర్లు: సోఫీ డెవిన్, ఎలీస్ పెర్రీ, రేణుక ఠాకూర్, రిచా ఘోష్.
ముంబై:
కెప్టెన్: హర్మన్‌ప్రీత్ కౌర్
కీలక క్రికెటర్లు: నాట్ సీవర్, హీథర్ గ్రాహమ్, పూజ వస్త్రాకర్, యాస్తిక భాటియా
ఢిల్లీ:
కెప్టెన్:మెగ్ లానింగ్
కీలక క్రికెటర్లు: జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ, మరీజనె కాప్.
గుజరాత్ టైటాన్స్:
కెప్టెన్: బెత్ మూనీ
కీలక క్రికెటర్లు: ఆష్లీ గార్డ్‌నర్, డాటిన్, సోఫియా డంక్లీ, స్నేహ్ రాణా
యూపీ
కెప్టెన్: అలీసా హీలీ
కీలక క్రికెటర్లు: దీప్తి శర్మ, సోఫీ ఎకిల్‌స్టన్, తహిలా మెక్‌గ్రాత్, షబ్నిమ్ ఇస్మాయిల్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications