For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WPL 2023 విజేతలకు భారీ నజరానా.. పీఎస్‌ఎల్ కంటే రెట్టింపు!

WPL 2023: How Much Prize Money Did The Winners Mumbai Indians Received?

ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్ విజేతలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) భారీ నజరానాను అందజేసింది. క్రికెట్ ప్రపంచాన్ని శాసించే బీసీసీఐ.. అమ్మాయిల ధనా ధన్ ఆటలోనూ రికార్డు ప్రైజమనీని ఇచ్చింది.

డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్ విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ రూ.6 కోట్ల రూపాయల ప్రైజ్‌మనీని అందజేసింది. ఐపీఎల్‌లో ఈ ప్రైజ్‌మనీ 20 లక్షలు ఉండగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో నడిచే పీఎస్‌ఎల్ ప్రైజ్‌మనీ రూ.3.4 కోట్లుగానే ఉంది. పీఎస్‌ఎల్ కంటే రెట్టింపు నగదు బహుమతిని డబ్ల్యూపీఎల్‌లో అందజేయడం చర్చనీయాంశమైంది.

పీఎస్ఎల్‌తో పాటు ఇతర లీగ్ లు, మహిళల క్రికెట్ లీగ్స్‌లో కంటే డబ్ల్యూపీఎల్ ప్రైజ్‌మనీనే ఎక్కువగా ఉండటం విశేషం. ఆస్ట్రేలియా వేదికగా జరిగే బిగ్‌బాష్ లీగ్ ప్రైజ్‌మనీ రూ.2.7 కోట్లు ఉండగా.. ఇంగ్లండ్‌లో నిర్వహించే ది హండ్రెడ్స్ లీగ్(అమ్మాయిలు) ప్రైజ్ మనీ రూ.1.5 కోట్లు మాత్రమే.

ఐపీఎల్ ప్రైజ్‌మనీ ముందు ఏ లీగ్ నగదు బహుమతి కూడా పనికిరాదు. సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రైజ్‌మనీ రూ.15 కోట్లు కాగా.. కరేబియన్ ప్రీమియర్ లీగ్ రూ.8 కోట్లు, ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్ టీ20) రూ. 5.7 కోట్లు, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ రూ.2.7 కోట్లుగా ఉంది.

డబ్ల్యూపీఎల్ విజేత అయిన ముంబై ఇండియన్స్‌కు రూ.6 కోట్ల ప్రైజ్‌మనీ దక్కగా.. రన్నరప్‌కు రూ.3 కోట్లు అందజేశారు.

డబ్ల్యూపీఎల్‌ అవార్డ్స్ జాబితా..

1. ఆరెంజ్ క్యాప్ : మెగ్ లానింగ్ (ఢిల్లీ క్యాపిట్సల్) - 345 రన్స్
2. పర్పుల్ క్యాప్ : హేలీ మాథ్యూస్ (ముంబై ఇండియన్స్) - 16 వికెట్లు
3. అత్యధిక వ్యక్తిగత స్కోర్ : సోఫీ డివైన్ (99 - ఆర్‌సీబీ) 4. అత్యుత్తమ బౌలింగ్ : మరియనె కాప్ (ఢిల్లీ : 5-15)
4. అత్యధిక సిక్స్‌లు : షెఫాలీ వర్మ (13)
5. మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ : హేలీ మాథ్యూస్ (16 వికెట్లు, 271 పరుగులు)
6. ఎమర్జింగ్ ప్లేయర్ : యస్తికా భాటియా
7. క్యాచ్ ఆఫ్ ది సీజన్ : హర్లీన్ డియోల్ (గుజరాత్)

Story first published: Monday, March 27, 2023, 15:52 [IST]
Other articles published on Mar 27, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+