Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023: మాథ్యూస్ ఆల్‌రౌండ్ షో.. ముంబై ఇండియన్స్ చేతిలో ఆర్‌సీబీ చిత్తు!

WPL 2023: Hayley Matthews, Nat Sciver-Brunt Helps MI beat RCB by 9-wickets

ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)‌లో ముంబై ఇండియన్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలో ముంబై గెలుపొందింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ముంబై 9 వికెట్ల తేడాతో సునాయస విజయాన్నందుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లో ముంబై సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ పేలవ బ్యాటింగ్‌తో 18.4 ఓవర్లలో 155 పరుగులకు కుప్పకూలింది.

రిచా ఘోష్(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 28), కనిక అహుజా(13 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 22), శ్రేయంక పాటిల్(15 బంతుల్లో 4 ఫోర్లతో 23), మేఘన్ స్కట్(14 బంతుల్లో 3 ఫోర్లతో 20) విలువైన పరుగులు చేశారు. ముంబై బౌలర్లలో హేలీ మాథ్యూస్(3/28) మూడు వికెట్లు తీయగా.. సైకా ఇషాక్(2/26), అమెలియా కేర్(2/30) రెండేసి వికెట్లు పడగొట్టారు. పూజా వస్త్రాకర్ ఓ వికెట్ పడగొట్టింది.

హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షో

హేలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షో

అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ 14.2 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 159 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. హేలీ మాథ్యూస్(38 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 77 నాటౌట్), నాట్ సివర్ బ్రంట్(29 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 55 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో రాణించారు. ఆర్‌సీబీ బౌలర్లలో ప్రీతి బోస్ ఒక్కరే ఒక వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. హీలీ మాథ్యూస్ ఆల్‌రౌండ్ షోతో ఆర్‌సీబీ పతనాన్ని శాసించింది.

ఓపెనర్ల శుభారంభం..

ఓపెనర్ల శుభారంభం..

156 పరుగుల సాధారణ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు హీలీ మాథ్యూస్, యస్తికా భాటియా(19 బంతుల్లో 4 ఫోర్లతో 23) శుభారంభం అందించారు. ఆరంభం నుంచి ఆర్‌సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఈ జోడీ తొలి వికెట్‌కు 45 పరుగులు జోడించింది. ప్రీతి బోసే బౌలింగ్‌లో యస్తికా భాటియా ఎల్బీగా వెనుదిరిగినా.. క్రీజులోకి వచ్చిన నాట్ సివర్ బ్రంట్‌తో కలిసి హీలీ మాథ్యూస్ చెలరేగింది. దాంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. అనంతర మరింత ధాటిగా ఆడిన మాథ్యూస్.. ఆర్‌సీబీ బౌలర్లను చెడుగుడు ఆడింది.

చెలరేగిన సీవర్ బ్రంట్..

చెలరేగిన సీవర్ బ్రంట్..

వరుస బౌండరీలతో ముంబై స్కోర్ బోర్డును పరుగెత్తింది. మరోవైపు నాట్ సివర్ కూడా ధాటిగా ఆడటంతో ముంబై స్కోర్ బోర్డు పరుగెత్తింది. 26 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మాథ్యూస్.. డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్థ శతకాన్ని అందుకుంది. అనంతరం మరింత ధాటిగా ఆడిన ఈ జోడీ పోటాపడి బౌండరీలు బాదింది. శ్రేయాంక పాటిల్ వేసిన 13వ ఓవర్లో బ్రంట్ వరుసగా ఫోర్ సిక్స్ బాదగా.. మాథ్యూ రెండు బౌండరీలు బాదింది. దాంతో ఈ ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. ఇక 28 బంతుల్లో నాట్ సివర్ హాఫ్ సెంచరీ సాధించింది. ఆ మరుసటి బంతినే బౌండరీకి తరలించి ముంబై విజయా లాంఛనాన్ని పూర్తి చేసింది.

Story first published: Monday, March 6, 2023, 22:50 [IST]
Other articles published on Mar 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+