WPL 2023: హర్మన్‌ప్రీత్ విధ్వంసం.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం

ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) తొలి మ్యాచ్‌లోనే ముంబై బ్యాటర్లు దుమ్ము రేపారు. తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో లీగ్‌కు కావాల్సిన అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(30 బంతుల్లో 14 ఫోర్లతో 65) తొలి మ్యాచ్‌లోనే పరుగుల విధ్వంసం సృష్టించింది. లీగ్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది.
దాంతో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. హర్మన్‌తో పాటు అమెలియా కేర్( 24 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), హెలీ మాథ్యూస్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. వారెహమ్, తనూజ కాన్వర్, అష్లే గార్డనర్ తలో వికెట్ పడగొట్టారు.

హేలీ మాథ్యూస్ సిక్సర్లు..
టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ముంబై ఇండియన్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తనుజా కన్వార్ వేసిన మూడో ఓవర్‌లోనే ఓపెనర్ యస్తికా భాటియా(1) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. క్రీజులో నాట్ సీవర్‌తో కలిసి హేలీ మాథ్యూస్ ఇన్నింగ్స్‌ను ముందుకునడిపించింది.
మాన్షి జోషి వేసిన రెండో ఓవర్‌లోనే సిక్స్, బౌండరీతో జోరు కనబర్చిన మాథ్యూస్.. వికెట్ పడినా అదే జోరు కనబర్చింది. మోనికా పటేల్ వేసిన ఐదో ఓవర్‌లో నాట్ సివర్ వరుసగా రెండు బౌండరీలు బాదగా.. కన్వర్ వేసిన ఆరో ఓవర్‌లో మాథ్యూస్ మరో బౌండరీలు బాదడంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది.

హర్మన్‌ప్రీత్ జోరు..
పవర్ ప్లే అనంతరం మరింత రెచ్చి పోయిన మాథ్యూస్.. సదర్లాండ్ వేసిన 8వ ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు బాదింది. వారెమ్ వేసిన మరుసటి ఓవర్‌లో మాథ్యూస్ మరో సిక్సర్ బాదగా.. అదే ఓవర్ ఐదో బంతికి నాట్ సివర్(23) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. గార్డనర్ వేసిన 10వ ఓవర్‌లో బౌండరీ బాది హాఫ్ సెంచరీకి చేరువైన మాథ్యూస్.. అదే ఓవర్ చివరి బంతికి కట్ షాట్ ఆడే ప్రయత్నంలో క్లీన్ బౌల్డ్ అయ్యింది. క్రీజులోకి వచ్చిన అమెలియా కేర్‌తో కలిసి హర్మన్‌ప్రీత్ కౌర్ చెలరేగింది. స్నేహ్ రాణా వేసిన 11వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన హర్మన్.. వార్‌హమ్ వేసిన 12వ ఓవర్ మరో రెండు బౌండరీలు బాదింది. కేర్ కూడా ఓ బౌండరీ కొట్టడంతో ఆ ఓవర్‌లో 16 పరుగులు వచ్చాయి.
ఫస్ట్ హాఫ్ సెంచరీ..
సదర్లాండ్ వేసిన మరుసటి ఓవర్‌లో వరుసగా హర్మన్ రెండు బౌండరీలు బాదగా.. రాణా బౌలింగ్‌లో కేర్ మరో రెండు బౌండరీలు కొట్టడంతో ముంబై స్కోర్ బోర్డు పరుగెత్తింది. మోనికా పటేల్ వేసిన ఐదో ఓవర్‌లో కేర్ ఓ బౌండరీ బాదగా.. హర్మన్ ప్రీత్ వరుసగా నాలుగు బౌండరీలు కొట్టింది. దాంతో ఆ ఓవర్‌లో 21 పరుగులు వచ్చాయి. గార్డనర్ వేసిన మరుసటి ఓవర్‌లో రెండో బంతిని డీప్ మిడ్‌వికెట్ దిశగా బౌండరీ బాదిన హర్మన్ ప్రీత్ కౌర్.. డబ్ల్యూపీఎల్‌లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేసింది. 23 బంతుల్లో హర్మన్ హాఫ్ సెంచరీ మార్క్ అందుకుంది.

కేర్ మెరుపులు..
ఆ తర్వాత మరో రెండు బౌండరీలు బాదిన ఆమె అదే జోరును కొనసాగించింది. స్నేహ్ రాణా వేసిన 17వ ఓవర్ చివరి బంతికి హర్మన్‌ప్రీత్ షార్ట్ థర్డ్ ఫీల్డర్‌కు చిక్కి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. క్రీజులోకి పూజా వస్త్రాకర్ రాగా.. అమెలియా కేర్ ధాటిగా ఆడుతూ జట్టు స్కోర్ బోర్డును పరుగెత్తించింది. చివరి ఓవర్‌లో రెండు సిక్స్‌లు బాదిన ముంబై.. గుజరాత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications