Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023: ముంబై ఇండియన్స్ శుభారంభం.. చిత్తయిన గుజరాత్!

 Harmanpreet, Ishaque star as Mumbai Indians

ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)ను ముంబై ఇండియన్స్ విజయంతో ఆరంభించింది. గుజరాత్ టైటాన్స్‌తో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై సమష్టిప్రదర్శనతో 143 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. బ్యాటింగ్‌లో కెప్టెన్ హర్మన్‌‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 14 ఫోర్లతో 65) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. బౌలింగ్‌లో సైకా ఇషాక్, నాట్ సివర్, అమెయిలా కేర్ సత్తా చాటారు. దాంతో గుజరాత్ జెయింట్స్ ఘోర పరాజయాన్ని చవిచూసింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20వ ఓవర్లలో 7 వికెట్లకు 207 పరుగులు చేసింది. హర్మన్‌ ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీకి తోడుగా అమెలియా కేర్( 24 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 45 నాటౌట్), హెలీ మాథ్యూస్(31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 47) మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా రెండు వికెట్లు తీయగా.. వారెహమ్, తనూజ కాన్వర్, అష్లే గార్డనర్ తలో వికెట్ పడగొట్టారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌటైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లోనే కెప్టెన్ బెత్ మూనీ(0) తీవ్రంగా గాయపడి రిటైర్ట్ ఔట్‌గా వెనుదిరిగింది. డయాలన్ హేమలత(23 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 29 నాటౌట్) ఒక్కతే పోరాడగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్(4/11) నాలుగు వికెట్లు తీయగా.. నాట్ సివర్, అమెయిలా కేర్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇస్సీ వాంగ్‌కు ఓ వికెట్ దక్కింది.

భారీ లక్ష్యచేధనకు దిగిన గుజరాత్ జెయింట్స్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ బెత్ మూనీ.. నాట్ సివర్ బౌలింగ్‌లో తీవ్రంగా గాయపడింది. దాంతో రిటైర్డ్ ఔట్‌గా వెనుదిరిగింది. బెత్ మూనీ వెనుదిరిగిన వెంటనే గుజరాత్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. హర్లీన్ డియోల్ చెత్త షాట్‌తో క్యాచ్ ఔటవ్వగా.. అష్లె గార్డనర్(0) కూడా డకౌటైంది. సబ్బినేన మేఘన(2) కూడా ఔటవ్వడంతో గుజరాత్ జెయింట్స్ పతనం మొదలైంది. మాన్సి జోషితో కలిసి హేమలతా పోరాడే ప్రయత్నం చేసినా ముంబై బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. ముంబై విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

Story first published: Saturday, March 4, 2023, 23:24 [IST]
Other articles published on Mar 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+