Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023: మ్యాచ్ విన్నర్‌ను పక్కనపెట్టిన యూపీ వారియర్స్.. బిత్తిరి నిర్ణయమంటూ..!

WPL 2023: Fans slams UP Warriorz for Match Winner Grace Harris sits out vs Delhi Capitals

ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) అరంగేట్ర సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న లీగ్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్‌పై కాస్త గ్రాస్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నానని యూపీ వారియర్స్ కెప్టెన్ అలిస్సా హీలీ తెలిపింది. మంచి బౌలింగ్ లైనప్‌తో బరిలోకి దిగుతున్నామని చెప్పిన హీలీ.. టీమ్ కాంబినేషన్‌లో భాగంగా గ్రేస్ హరీస్‌ను తప్పించి షబ్నిమ్ ఇస్మాయిల్‌ను తీసుకున్నామని తెలిపింది.

జట్టు నిండా గొప్ప ప్లేయర్లు ఉన్నప్పుడు కొన్నిసార్లు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తదని పేర్కొంది. ఈ మ్యాచ్ తమ ఆటగాళ్ల సత్తాకు పరీక్షని పేర్కొంది. తాము ముందు ఏది చేయాల్సి వచ్చినా చేసేందుకు సిద్దమని క్యాపిటల్స్ కెప్టెన్ లాన్నింగ్ తెలిపింది. జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పింది. అయితే యూపీ వారియర్స్ తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మ్యాచ్ విన్నర్‌ను పక్కనపెట్టడం కంటే బిత్తిరి నిర్ణయమని మండిపడుతున్నారు.

గుజరాత్ జెయింట్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో యూపీ వారియర్స్ స్టన్నింగ్ విక్టరీ నమోదు చేసింది. గ్రేస్ హరీస్ (26 బాల్స్​లో 59 నాటౌట్) విధ్వంసకర హాఫ్ సెంచరీతో ఓడిపోవాల్సిన మ్యాచ్‌లో విజయాన్నందుకుంది. గుజరాత్ నిర్దేశించిన 170 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన యూపీ వారియర్స్.. కిరణ్ నవ్‌గిరె సాయంతో గ్రేస్ హరీస్ సంచలన విజయాన్నందించింది. దాంతోనే మ్యాచ్‌ను గెలిపించిన హరీస్ ఎలా పక్కనబెడతారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.

తుది జట్లు:
యూపీ వారియర్స్ : అలిస్సా హీలీ (కెప్టెన్), శ్వేతా సెహ్రావత్, కిరణ్ నవ్‌గిరె, తహిలా మెక్‌గ్రాత్, దీప్తి శర్మ,షబ్నమ్ ఇస్మాయిల్, సిమ్రాన్ షేక్, దేవికా వైద్య, సోఫీ ఎక్లిస్టోన్, అంజలి శర్వాణి, రాజేశ్వరి గైక్వాడ్

ఢిల్లీ క్యాపిటల్స్ : మెగ్ లానింగ్ (కెప్టెన్), షెఫాలీ వర్మ, మరిజనె కాప్, జెమీమా రోడ్రిగ్స్, అలిస్ క్యాప్సీ, జెన్ జొనాసేన్, తానియా భాటియా, అరుంధతి రెడ్డి, శిఖా పాండే, రాధా యాదవ్, తారా నోరిస్

Story first published: Tuesday, March 7, 2023, 19:41 [IST]
Other articles published on Mar 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+