WPL 2023: ఆర్‌సీబీ మెంటార్‌గా సానియా మీర్జా.. అందాలన్నీ ఒక్క టీమ్‌లోనే..!

న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) సరికొత్త సంప్రదాయానికి తెరలేపింది. మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఓ ఫ్రాంచైజీని సొంతం చేసుకున్న ఆర్‌సీబీ.. జట్టు మెంటార్‌గా క్రికెటేతర ప్లేయర్‌ను నియమించింది. భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జాకు ఈ బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్ వేదికగా ఓ ప్రకటనను విడుదల చేసింది. తమ మహిళా జట్టుకు మార్గదర్శనం చేసేందుకు ఇంతకంటే గొప్ప వ్యక్తి మరొకరు దొరకరంటూ సానియాకు స్వాగతం పలికింది.
సానియాకు స్వాగతం..
'మా కోచింగ్ సిబ్బంది క్రికెట్‌కు సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది. అయితే, కఠిన పరిస్థితులు, ఒత్తిడిని అధిగమించేందుకు మా మహిళా క్రికెటర్లకు సరైన మార్గదర్శి ఉండాలని భావించాం. ఛాంపియన్ అథ్లెట్, అవరోధాలు అధిగమించి దిగ్గజ ప్లేయర్‌గా ఎదిగిన వ్యక్తిని మా మెంటార్‌గా నియమించాం. మా కుటుంబంలోకి ఆమెకు స్వాగతం పలుకుతున్నాం. నమస్కారం సానియా మీర్జా'అని పేర్కొంది.
ఉత్సాహంగా ఉన్నా...
ఈ నియామకంపై సానియా మీర్జా సంతోషం వ్యక్తం చేసింది. ఆర్‌సీబీ హోస్ట్‌తో మాట్లాడిన సానియా మీర్జా.. ఈ ఆఫర్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొంది. అయితే ఈ బాధ్యతలు నిర్వర్తించేందుకు తాను చాలా ఉత్సాహంగా ఉన్నానని తెలిపింది. గత 20 ఏళ్లుగా తాను ప్రోఫెషనల్ ప్లేయర్‌గా రాణించానని, ఇప్పుడు యువ మహిళా ప్లేయర్లకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నానని పేర్కొంది. ఆర్‌సీబీ మెంటార్‌గా ప్లేయర్లకు అండగా ఉంటూ.. వారి విజయంలో కీలక పాత్ర పోషిస్తానని చెప్పుకొచ్చింది.
అందాలన్నీ ఆర్‌సీబీలోకే..
సానియా మీర్జా నియామకంపై ఆర్‌సీబీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో స్మృతి మంధానను రూ.3.40 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన ఆర్‌సీబీ.. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఎల్లిస్ పెర్రీని తీసుకుంది. మహిళా క్రికెటర్లలోనే అత్యంత బ్యూటీఫుల్ ప్లేయర్లు అయిన స్మృతి మంధాన, ఎల్లిస్ పెర్రీలు ఆర్‌సీబీలోనే ఉండటం.. తాజాగా టెన్నిస్ బ్యూటీ జట్టుతో చేరడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అందాలన్నీ ఆర్‌సీబీలోకేనని కామెంట్ చేస్తున్నారు. స్మృతి మంధాన, ఎల్లిస్ పెర్రీ, సానియా మీర్జా ఆట కంటే వారి అందాలను ఆరాధించే అభిమానులు కూడా ఉన్నారు. 36 ఏళ్ల సానియా మీర్జా ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నెలలో జరిగిన అబుదాబి ఓపెన్‌తో వీడ్కోలు పలికింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పూర్తి జట్టు:
స్మృతి మంధాన, సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, రేణుకా సింగ్, రిచా ఘోష్, ఎరిన్ బర్న్స్, దిషా కసత్, ఇంద్రాణీ రాయ్, శ్రేయాంక పాటిల్, కణకా అహూజా, ఆశా శోభన, హెతర్ నైట్, డేన్ వాన్ నీకెర్క్, ప్రీతి బోస్, పూనమ్ ఖెమ్నార్, కోమల్ జంజాద్, మేగన్ షూట్, సహానా పవార్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications