WPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచినా.. మెక్‌గ్రాత్ వణికించింది!

ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఆ జట్టు గెలుపొందింది. మంగళవారం యూపివారియర్స్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఢిల్లీ క్యాపిటల్స్ 42 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 211 పరుగులు చేసింది.
కెప్టెన్ మెగ్ లాన్నింగ్(42 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో రాణించగా.. జెస్ జొనాస్సెన్(20 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42 నాటౌట్) విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగింది. జెమీమా రోడ్రిగ్స్(22 బంతుల్లో 4 ఫోర్లతో 34 నాటౌట్), అలిస్ కాప్సీ(10 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 21) మెరుపులు మెరిపించారు. యూపీ వారియర్స్ బౌలర్లలో షబ్నిమ్ ఇస్మాయిల్, రాజేశ్వరి గైక్వాడ్, తహిళా మెక్‌గ్రాత్, సోఫీ ఎకిల్‌స్టోన్ తలో వికెట్ తీసారు.
అనంతరం భారీ లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులకే పరిమితమైంది. తహిళా మెక్‌గ్రాత్(50 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 90 నాటౌట్) మినహా అంతా విఫలమయ్యారు. ఆమెకు ఒక్కరు కూడా అండగా నిలవలేకపోయారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో జెస్ జొనాస్సెన్(3/25) మూడు వికెట్లు తీయగా.. మరిజన్నే కాప్, శిఖా పాండే తలో వికెట్ తీసారు.
భారీ లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. కెప్టెన్ అలిస్సా హీలీ(24) నాలుగో ఓవర్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగింది. ఆ తర్వాత వచ్చిన శ్వేతా సెహ్రావత్(1), కిరన్ నవిగిరే(2) దారుణంగా విఫలమయ్యారు. క్రీజులోకి వచ్చిన తహిళా మెక్‌గ్రాత్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేసినా.. ఆమెకు మరోవైపు సహకారం లభించలేదు. దీప్తి శర్మ(12), దేవిక వైద్య(23) దారుణంగా విఫలమయ్యారు. సిమ్రాన్ షైక్ సాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న మెక్‌గ్రాత్.. ఢిల్లీ బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. జట్టును గెలిపించకపోయినా.. ఢిల్లీని వణికించింది. ఆమెకు ఒక్కరు అండగా నిలిచినా.. యూపీ వారియర్స్ విజయాన్నందుకునేది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications