WPL 2023 Auction: ఆర్‌సీబీలోకి స్మృతి మంధానా, ఎల్లిస్ పెర్రీ.. రికార్డు ధర పలికిన క్రికెట్ బ్యూటీ!

ముంబై: బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో కీలక అంకానికి తెరలేచింది. ముంబైలోని జియో కన్వేన్షన్ సెంటర్ వేదికగా డబ్ల్యూపీఎల్ అరంగేట్ర సీజన్‌కు సంబంధించిన వేలం ప్రారంభమైంది. ఫస్ట్ సెట్‌లో భారత స్టార్ ఆటగాళ్లు స్మృతి మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్‌లతో పాటు ఎల్లిస్ పెర్రీల కోసం ఐదు ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధానను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ)రూ. 3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.
వేలంలో తొలి ప్లేయర్‌గా స్మృతి మంధాన పేరు రాగా.. ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్, గుజరాత్, ఢిల్లీ క్యాపిటల్స్, యూపీ వారియర్స్ తీవ్రంగా పోటీపడ్డాయి. తమ కెప్టెన్‌గా భావించిన ఆర్‌సీబీ రూ.3.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. రెండో ప్లేయర్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రాగా.. రూ.1.8 కోట్లకు ముంబై ఇండియన్స్ తీసుకుంది. న్యూజిలాండ్‌కు చెందిన సోఫీ డివైన్‌ను రూ. 50 లక్షలకు తీసుకున్న ఆర్‌సీబీ.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ఎల్లిస్ పెర్నీని రూ.1.7 కోట్ల భారీ ధరకు తీసుకుంది. తొలి సెట్‌లో ఆరుగురు ప్లేయర్లను వేలం వేయగా.. ముగ్గురిని ఆర్‌సీబీనే కొనుగోలు చేయడం విశేషం.
స్మృతి మంధానన కొనుగోలు చేయడంపై అటు ఆర్‌సీబీ ఫ్రాంచైజీ ఇటు అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నెంబర్ 18 జెర్సీతో ఆడే విరాట్ కోహ్లీ, స్మృతి మంధానలు ఇద్దరూ ఆర్‌సీబీకే ఆడుతున్నారని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. స్మృతి మంధానా అత్యధిక ధర పలకడంపై భారత మహిళా క్రికెటర్లు కూడా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ కోసం సౌతాఫ్రికాలో ఉన్న భారత మహిళా క్రీడాకారులు.. వేలాన్ని టీవీలో వీక్షిస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. ఆర్‌సీబీ జట్టును స్మృతి మంధాన నడిపించే అవకాశం ఉంది.
వేలం నిబంధనల ప్రకారం ఒక్కో జట్టు దగ్గర రూ.12 కోట్ల పర్స్ మనీ ఉండగా.. ఒక్కో జట్టు గరిష్టంగా 18 మంది.. కనిష్టంగా 15 మందిని కొనుగోలు చేయాలి. ఇందులో ఆరుగురు విదేశీ ప్లేయర్లు మాత్రమే ఉండాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications