Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WPL 2023 Auction: అమ్మాయిల జాక్‌పాట్.. ఐదు జట్లు ఇవే!

WPL 2023 Auction: Full List of all Five Squads in Womens Premier League

ముంబై: మొట్టమొదటి మహిళల ప్రిమియర్‌ లీగ్‌ (డబ్ల్యూపీఎల్‌) కోసం సోమవారం నిర్వహించిన వేలంలో భారత క్రికెటర్ల పంట పండింది. టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ స్మృతి మంధాన అంచనాలకు మించి అత్యధిక ధర పలికిన క్రికెటర్‌గా నిలిచింది. ఆమె కోసం రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఏకంగా రూ.3.4 కోట్లు వెచ్చించింది. ప్రతి జట్టు రూ.12 కోట్లతో వేలంలో అడుగుపెట్టాయి. మొత్తం 409 మంది వేలం బరిలో దిగగా... 87 మందిని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేశాయి.

అందులో 30 మంది విదేశీ క్రికెటర్లు. ఒక్కో జట్టు 6 మంది విదేశీ క్రికెటర్ల చొప్పున తీసుకుంది. మొత్తం రూ.59.5 కోట్లను ఫ్రాంఛైజీలు ఖర్చు పెట్టాయి. ఆర్సీబీ, దిల్లీ, గుజరాత్‌ 18 మంది క్రికెటర్ల చొప్పున కొనుగోలు చేయగా.. ముంబయి 17 మందిని, యూపీ వారియర్స్‌ 16 మందిని సొంతం చేసుకున్నాయి. ముంబయి, యూపీ మొత్తం డబ్బు ఖర్చు చేయగా.. దిల్లీ దగ్గర రూ.35 లక్షలు, ఆర్సీబీ దగ్గర రూ.10 లక్షలు, గుజరాత్‌ దగ్గర రూ.5 లక్షలు మిగిలాయి. తొలి సీజన్‌లో పోటీపడే ఐదు జట్లు ఇవే..

ముంబై ఇండియన్స్‌:

నటాలీ సీవర్‌ (రూ.3.2 కోట్లు), పూజ వస్త్రాకర్‌ (రూ.1.9 కోట్లు), హర్మన్‌ప్రీత్‌ (రూ.1.8 కోట్లు), యాస్తిక భాటియా (రూ.1.5 కోట్లు), అమెలియా (రూ.కోటి), అమన్‌జోత్‌ (రూ.50 లక్షలు), హేలీ మాథ్యూస్‌ (రూ. 40 లక్షలు), ట్రైయాన్‌, హీథర్‌ గ్రాహమ్‌, ఇసబెల్లె (రూ. 30 లక్షలు), ప్రియాంక (రూ. 20 లక్షలు), ధార గుజ్జర్‌, హుమైరా, జింతిమణి, నీలమ్‌ బిష్ఠ్‌, సైకా ఇషాక్‌, సోనమ్‌ యాదవ్‌ (రూ. 10 లక్షలు).

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు:

స్మృతి మంధాన (రూ.3.4 కోట్లు), రిచా ఘోష్‌ (రూ. 1.9 కోట్లు), ఎలీస్‌ పెర్రీ (రూ. 1.7 కోట్లు), రేణుక సింగ్‌ (రూ. 1.5 కోట్లు), సోఫీ డివైన్‌ (రూ. 50 లక్షలు), హెదర్‌ నైట్‌, మెగాన్‌ షట్‌ (రూ.40 లక్షలు), కనిక (రూ.35 లక్షలు), డేన్‌ వాన్‌, ఎరిన్‌, ప్రీతి (రూ.30 లక్షలు), కోమల్‌ (రూ.25 లక్షలు), ఆశ, దిశ, ఇంద్రాణి, పూనమ్‌, సహాన, శ్రేయాంక (రూ. 10 లక్షలు)

ఢిల్లీ క్యాపిటల్స్‌:

జెమీమా రోడ్రిగ్స్ (రూ.2.2 కోట్లు), షెఫాలి వర్మ (రూ. 2కోట్లు), మరిజేన్‌ కాప్‌ (రూ. 1.5 కోట్లు), మెగ్‌ లానింగ్‌ (రూ.1.1 కోట్లు), అలీస్‌ కాప్సీ (రూ.75 లక్షలు), శిఖా పాండే (రూ.60 లక్షలు), జెస్‌ జొనాసెన్‌ (రూ. 50 లక్షలు), లారా హారిస్‌ (రూ. 45 లక్షలు), రాధా యాదవ్‌ (రూ. 40 లక్షలు), అరుంధతి రెడ్డి, మిన్ను మాని, పూనమ్‌ యాదవ్‌, స్నేహదీప్తి, తనియా భాటియా (రూ. 30 లక్షలు), తితాస్‌ సాధు (25 లక్షలు), జాసియా అక్తర్‌ (20 లక్షలు), అపర్ణ, తారా నోరిస్‌ (10 లక్షలు).

గుజరాత్‌ జెయింట్స్‌:

ఆష్లీ గార్డ్‌నర్‌ (రూ.3.2 కోట్లు), బెత్‌ మూనీ (రూ. 2 కోట్లు), జార్జియా, స్నేహ్‌ రానా (రూ. 75 లక్షలు), అనబెల్‌ సదర్‌లాండ్‌ (రూ.70 లక్షలు), డాటిన్‌, సోఫియా, సుష్మ (రూ. 60 లక్షలు), తనుజ (రూ.50 లక్షలు), హర్లీన్‌ (రూ. 40 లక్షలు), అశ్వని కుమారి (రూ. 35 లక్షలు), హేమలత, మాన్సి జోషి, మోనికా, సబ్బినేని మేఘన (రూ. 30 లక్షలు); హర్లీ గాలా, పారుణిక, షబ్నమ్‌ (రూ. 10 లక్షలు).

యూపీ వారియర్స్‌:

దీప్తి శర్మ (రూ.2.6 కోట్లు), సోఫీ ఎకిల్‌స్టోన్‌ (రూ. 1.8 కోట్లు), దేవిక, తాలియా మెక్‌గ్రాత్‌ (రూ. 1.4 కోట్లు), షబ్నిమ్‌ (రూ.కోటి), గ్రేస్‌ హారిస్‌ (రూ. 75 లక్షలు), అలీసా హీలీ (రూ. 70 లక్షలు), అంజలి శర్వాణి (రూ. 55 లక్షలు), రాజేశ్వరి గైక్వాడ్‌, శ్వేత (రూ. 40 లక్షలు), కిరణ్‌ నవ్‌గిరె, లారెన్‌ బెల్‌ (రూ. 30 లక్షలు), లక్ష్మీ యాదవ్‌, పర్శవి చోప్రా, యషశ్రీ, సిమ్రాన్‌ (రూ. 10 లక్షలు).

Story first published: Tuesday, February 14, 2023, 8:25 [IST]
Other articles published on Feb 14, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+