WPL 2023: ముంబై ఇండియన్స్‌కు షాకిచ్చిన యూపీ వారియర్స్!

ముంబై: వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న ముంబై ఇండియన్స్(MI)కు యూపీ వారియర్స్ ఊహించని షాకిచ్చింది. శనివారం డీవై పాటిల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన యూపీ వారియర్స్ 5 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. ఈ టోర్నీలో వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలిచిన ముంబైకి ఇదే తొలి పరాజయం కావడం గమనార్హం.
ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 127 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ హీలీ మాథ్యూస్(30 బంతుల్లో ఫోర్, 3 సిక్స్‌లతో 35), కెప్టెన్ హార్మన్ ప్రీత్ కౌర్(22 బంతుల్లో 3 ఫోర్లతో 25), ఇస్పీ వాంగ్(19 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32) టాప్ స్కోరర్లుగా నిలిచారు. యూపీ బౌలర్లలో సోఫీ ఎక్లిస్టోన్ మూడు వికెట్లు తీయగా.. రాజశ్వేరి గైక్వాడ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు పడగొట్టింది.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన యూపీ వారియర్స్ 19.3 ఓవర్లలోనే 5 వికెట్లకు 129 పరుగులు చేసి మరో 3 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. ముంబై బౌలర్లలో అమెలియా కేర్ రెండు వికెట్లు తీయగా.. హీలీ మాథ్యూస్, నాట్ సివర్ బ్రంట్, ఇస్సీ వాంగ్ తలో వికెట్ తీసారు. యూపీ విజయంలో కీలక పాత్ర పోషించిన దీప్తి శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. ఈ విజయంతో యూపీ వారియర్స్ తమ ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖారారు చేసుకోగా.. ఢిల్లీ, యూపీ వారియర్స్ చేరువగా ఉన్నాయి. ఆర్‌సీబీ దాదాపు రేసులో నుంచి తప్పుకోగా.. గుజరాత్ జెయింట్స్‌కు అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications