Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇంత చెత్త అంపైరింగ్ ఎప్పుడూ చూడలేదు: మహమ్మద్ కైఫ్ (వీడియో)

ఐపీఎల్ 2026 సీజన్‌లో అంపైర్ల పని తీరు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా థర్డ్ అంపైర్ తీసుకునే నిర్ణయాలు తీవ్ర వివాదాస్పదమవుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య కోల్‌కతా వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లోనూ అంపైర్ తీసుకున్న ఓ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.

అంపైర్ల తప్పిదం కారణంగా కేకేఆర్ విధ్వంసకర ఓపెనర్ ఫిన్ అలెన్(9) క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభిమానుల‌తో పాటు కామెంటేటర్లు, మాజీ క్రికెటర్లు కూడా ఈ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అయితే ఇలాంటి చెత్త అంపైరింగ్ ఎక్కడా చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చెత్త అంపైరింగ్..

జియో హాట్‌స్టార్ ఎక్స్‌పర్ట్ ప్యానెల్‌లో ఉన్న మహమ్మద్ కైఫ్.. అంపైర్ల నిర్ణయంపై ఘాటుగా స్పందించాడు. కాస్త సమయం తీసుకొని నిర్ణయం ప్రకటిస్తే ఏం అవుతుందని చురకలంటించాడు. 'ఇంత చెత్త అంపైరింగ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. అది క్లియర్‌గా సిక్స్. బౌండరీ రోప్ కదిలింది.

Worst Umpiring Ever Mohammad Kaif Fumes Over Finn Allen s Controversial Catch in KKR vs LSG Clash

ఫీల్డర్ కాలు కూడా బౌండరీని తాకినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. మ్యాచ్ అర్ధరాత్రి వరకు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అంపైర్‌కు చెక్ చేయడానికి తగినంత సమయం ఉంది. ఇలాంటి పెద్ద నిర్ణయాలను ఈ విధంగా తీసుకోవడంలో అర్థమే లేదు. చాలా చెత్త అంపైరింగ్. అది ఖచ్చితంగా సిక్సర్.'అని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చాడు.

అసలేం జరిగిందంటే..?

లక్నో సూపర్ జెయింట్స్ పేసర్ ఫిన్ అలెన్ వేసిన రెండో ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీ బాదిన ఫిన్ అలెన్.. నాలుగో బంతిని థర్డ్ మ్యాన్ దిశగా భారీ షాట్ ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న దిగ్వేష్ రతి బౌండరీ లైన్‌పై అద్భుతంగా అందుకున్నాడు. అయితే క్యాచ్ అందుకునే క్రమంలో అతని కాలు బౌండరీ రోప్ తాకినట్లు అనిపించింది.

దాంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ సమీక్ష కోరగా.. పలుకోణాల్లో పరిశీలించి ఔటిచ్చాడు. అయితే రిప్లేలో బౌండరీ రోప్ జరిగినట్లు.. రతి కాలు తాకినట్లు కనిపించింది. కానీ అంపైర్ ఔటివ్వడంతో ఈ నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. సోషల్ మీడియా వేదికగా అంపైర్లపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా సిక్సరేనని, అంపైర్లు తొండాట ఆడుతున్నారని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ క్యాచ్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

కేకేఆర్ 181/4

ఈ మ్యాచ్‌లో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), అంగ్‌క్రిష్ రఘువంశీ(33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45) టాప్ స్కోరర్లుగా నిలిచారు. కామెరూన్ గ్రీన్(24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 32 నాటౌట్), రోవ్‌మన్ పోవెల్(24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39 నాటౌట్) పర్వాలేదనిపించారు. లక్నో బౌలర్లలో ప్రిన్స్ యాదవ్, సిద్దార్థ్, దిగ్వేష్ రతి, ఆవేష్ ఖాన్ తలో వికెట్ తీసారు.

Story first published: Thursday, April 9, 2026, 21:57 [IST]
Other articles published on Apr 9, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+