Worldcup 2023 Final: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ
IND vs AUS, Worldcup 2023 Final: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టోర్నీ ఫైనల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర రికార్డ్‌ను అధిగమించాడు. సంగక్కర ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో 320 పరుగులు చేయగా.. విరాట్ ఈ ఘనతను అధిగమించాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఫైనల్లో హాఫ్ సెంచరీ సాధించిన విరాట్ కోహ్లీ..ఈ ఫీట్ అందుకున్నాడు. సెమీఫైనల్, ఫైనల్లో 50 ప్లస్ రన్స్ చేసిన తొలి భారత బ్యాటర్‌గా కూడా కోహ్లీ చరిత్రకెక్కాడు. అంతేకాకుండా రెండు ప్రపంచకప్ టోర్నీల్లో వరుసగా ఐదుస్లారు 50+ రన్స్ చేసిన బ్యాటర్‌గా కూడా విరాట్ కోహ్లీ నిలిచాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్(4) దారుణంగా విఫలమయ్యాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో ఫైనల్ ఒత్తిడి తట్టుకోలేకపోయాడు. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో చెత్త షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను గ్లేన్ మ్యాక్స్‌వెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అనవసర షాట్‌తో రోహిత్ శర్మ(47) మూల్యం చెల్లించుకున్నాడు. ట్రావిస్ హెడ్ సూపర్ క్యాచ్‌కు వెనుదిరిగాడు.
ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(4)ను ప్యాట్ కమిన్స్ బోల్తా కొట్టించాడు. దాంతో టీమిండియా 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. పూర్తిగా డిఫెన్స్‌కే పరిమితమైన ఈ జోడీ.. క్విక్ సింగిల్స్, డబుల్స్‌తో ఇన్నింగ్స్ నిర్మించింది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 56 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
67 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని కమిన్స్ విడదీసాడు. తెలివైన బంతితో విరాట్ కోహ్లీని బోల్తా కొట్టించాడు. స్లో షాట్ పిచ్ బాల్‌ను థర్డ్ మ్యాన్ దిశగా ఆడబోయిన విరాట్ కోహ్లీ.. బంతిని సరిగ్గా అంచనా వేయలేక వికెట్ల మీదకు ఆడుకున్నాడు. ఇన్‌సైడ్ ఎడ్జ్ అయిన బంతి కోహ్లీ వికెట్లను గీరాటేసింది.
ఇక విరాట్ కోహ్లీ ఈ టోర్నీలో 11 ఇన్నింగ్స్‌ల్లో 95.63 యావరేజ్‌తో 765 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలతో పాటు 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications