Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Worldcup 2023 Final: మైదానంలోకి దూసుకొచ్చిన అభిమాని!

IND vs AUS, Worldcup 2023 Final: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సెక్యూరిటీ కళ్లు గప్పిన ఓ అభిమాని మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా తన ఆరాధ్య దైవమైన విరాట్ కోహ్లీ దగ్గరకు వెళ్లి గట్టిగా హగ్ చేసుకున్నాడు.

ఈ ఊహించని ఘటనతో అప్రమత్తమైన సెక్యూరిటీ.. సదరు అభిమానిని బయటకు లాక్కెళ్లారు. దాంతో ఆటకు కాసేపు అంతరాయం కలిగింది. లక్షా 33 వేల మంది హాజరైన ఈ మ్యాచ్‌కు గుజరాత్ ప్రభుత్వం సుమారు 5 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాట్లు చేసింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఇతర ప్రముఖులు హాజరుకానున్ననేపథ్యంలో భారీ సంఖ్యలో పోలీసులను మోహరించింది.

Worldcup 2023 Final: A fan entered in the stadium and tried to hug his idol King Kohli

కానీ తన అభిమాన క్రికెటర్‌ను కలుసుకునేందుకు తెగించిన సదరు అభిమాని.. పోలీసుల కళ్లు గప్పి మైదానంలోకి దూసుకెళ్లాడు. సదరు ఫ్యాన్‌ను మైదానం బయటకు తీసుకెళ్లిన పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఎన్నో అంచనాల మధ్య ఫైనల్ బరిలోకి దిగిన శుభ్‌మన్ గిల్.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోయాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో ఫైనల్ ఒత్తిడి తట్టుకోలేకపోయిన శుభ్‌మన్ గిల్.. మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో చెత్త షాట్‌తో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి రోహిత్ ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. తనకే సాధ్యమైన ట్రేడ్ మార్క్ సిక్సర్లతో వేగంగా పరుగులు రాబట్టాడు. హాఫ్ సెంచరీకి చేరువైన రోహిత్ శర్మను గ్లేన్ మ్యాక్స్‌వెల్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన రోహిత్.. భారీ షాట్ ఆడబోయి మూల్యం చెల్లించుకున్నాడు.

రోహిత్ ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను ట్రావిస్ హెడ్ అద్భుతంగా అందుకున్నాడు. శ్రేయస్ అయ్యర్ వచ్చి రావడంతోనే బౌండరీతో దూకుడు కనబర్చాడు. కానీ ప్యాట్ కమిన్స్ వేసిన తెలివైన బంతికి కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. దాంతో టీమిండియా 81 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కేఎల్ రాహుల్‌తో కలిసి విరాట్ కోహ్లీ(39 బ్యాటింగ్) ఆచితూచి ఆడుతున్నారు.

Story first published: Sunday, November 19, 2023, 15:40 [IST]
Other articles published on Nov 19, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+