ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులతో పాటు బౌండరీలు బాదిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ సాధించాడు. టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే ఉద్దేశంతో ఐసీసీ 2019లో డబ్ల్యూటీసీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి టెస్ట్‌ల్లో సూపర్ ఫామ్ కనబరుస్తున్న జో రూట్ 520 బౌండరీలతో అగ్రస్థానంలో నిలిచాడు.
ఇటీవల శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌లో జో రూట్ జోరు కనబర్చాడు. రెండు శతకాలతో 375 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ ఒక్క సిరీస్‌లో 37 బౌండరీలు బాదిన జోరూట్... 500 ఫోర్లు మైలు రాయి అందుకున్నాడు. డబ్ల్యూటీసీలో జో రూట్ 520 బౌండరీలతో అగ్రస్థానంలో ఉండగా.. మార్నస్ లబుషేన్(446), స్టీవ్ స్మిత్(379), జాక్ క్రాలీ(353) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు. జో రూట్‌కు సమీపంగా మరే బ్యాటర్ కూడా లేడు.

డబ్ల్యూటీసీలో మొత్తం 4973 పరుగులు చేసిన జో రూట్.. టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. డబ్ల్యూటీసీ 2023-25 సైకిల్‌లోనూ రూట్ లీడింగ్ స్కోరర్‌గా నిలిచాడు. 29 ఇన్నింగ్స్‌ల్లో 53.76 సగటుతో 1398 పరుగులు చేశాడు. ఇందులో ఐదు శతకాలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
2020 నుంచి నిలకడగా ఆడుతున్న జో రూట్ ఫాబ్-4 బ్యాటర్లలో ఉత్తమ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ నాలుగేళ్ల కాలంలో 56 మ్యాచ్‌లు ఆడిన జోరూట్ 17 శతకాలు నమోదు చేశాడు. అతని తర్వాత కేన్ విలియమ్సన్ ఒక్కడే 11 సెంచరీలు చేయగా.. కోహ్లీ, స్మిత్ వారికి దరిదాపుల్లో కూడా లేరు.
టెస్ట్‌లో అత్యధిక సెంచరీలు, పరుగుల రికార్డు భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిటే ఉంది.
టెస్ట్‌ల్లో 51 సెంచరీలు చేసిన సచిన్.. 15,921 రన్స్‌తో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ రికార్డులను అధిగమించడం జో రూట్ కన్నైసాడు. జో రూట్ మాత్రమే ఈ రికార్డ్స్ అధిగమించగలడని మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు.
సచిన్ నెలకొల్పిన ఈ ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను అధిగమించాలంటే జో రూట్ మరో 18 శతకాలతో పాటు 3,544 పరుగులు చేయాలి. 22 ఏళ్ల వయసున్న జోరూట్ మరో నాలుగేళ్ల పాటు ఇదే ఫామ్ కనబరిస్తే.. సునాయసంగా ఈ రికార్డ్స్‌ను అధిగమిస్తాడు. శ్రీలంకతో జరిగిన మూడు టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓటమిపాలైంది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(124 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 127 నాటౌట్) అజేయ శతకంతో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి మ్యాచ్‌లో ఓడినా తొలి రెండింటిలో గెలిచిన ఇంగ్లండ్ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.