Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: భారత్‌తో తలపడే న్యూజిలాండ్‌ తుది జట్టు ఇదే!

 World Test Championship Final: New Zealand’s predicted playing XI against India

హైదరాబాద్: టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ పెంచాలనే లక్ష్యంతో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తీసుకొచ్చిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) తుది దశకు చేరుకుంది. గత రెండేళ్లుగా సుదీర్ఘంగా సాగిన ఈ మెగా టోర్నీ టైటిల్ పోరుకు మరో 10 రోజుల్లో తెరలేవనుంది. ఇంగ్లండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు.. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

జూన్ 23ని రిజర్వ్ డేగా కేటాయించారు. తొలి ఐసీసీ టెస్ట్ ఈవెంట్ కావడంతో ఈ ఫైనల్‌ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఈ మ్యాచ్‌కు సంబంధించిన అంచనాలు, విశ్లేషణలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈ టైటిల్ పోరులో బరిలోకి దిగే న్యూజిలాండ్ తుది జట్టు గురించి తెలుసుకుందాం.

ఓపెనర్లుగా డబుల్ హీరో, వైస్ కెప్టెన్..

ఓపెనర్లుగా డబుల్ హీరో, వైస్ కెప్టెన్..

ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్‌లో న్యూజిలాండ్ తరఫున ఓపెనర్లుగా టామ్ లాథమ్, యువ ప్లేయర్ డెవాన్ కాన్వే బరిలోకి దిగనున్నారు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. లాథమ్ అద్భుతమైన ఓపెనర్ అన్న విషయం తెలిసిందే. కివీస్ టీమ్‌కు ఈ లెఫ్టార్మ్ బ్యాట్స్‌మన్ వైస్ కెప్టెన్ కూడా. డబ్ల్యూటీసీ టోర్నీలో ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన లాథమ్ 40 సగటుతో 680 రన్స్ చేశాడు. ఇక మరో ఓపెనర్ డెవాన్ కాన్వే.. ఇంగ్లండ్‌తో అరంగేట్ర మ్యాచ్‌లోనే డబుల్ సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. సౌతాఫ్రికా సంతతికి చెందిన కాన్వే.. ఇంగ్లండ్‌తో జరిగిన ఫస్ట్ మ్యాచ్‌లోనే దుమ్మురేపాడు. సూపర్ బ్యాటింగ్‌తో అందరి దృష్టిని ఆకర్షించాడు.

మిడిలార్డర్‌లో కేన్, టేలర్, నికోల్స్, వాట్లింగ్

మిడిలార్డర్‌లో కేన్, టేలర్, నికోల్స్, వాట్లింగ్

కెప్టెన్ విలియమ్సన్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ వస్తాడు. ఆ తర్వాత సీనియర్ ప్లేయర్ రాస్ టేలర్, హెన్రీ నికోల్స్.. నాలుగు, ఐదో స్థానాల్లో బ్యాటింగ్ చేస్తారు. ఇక వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్‌గా బీజే వాట్లింగ్‌కు తుది జట్టులో చోటు ఖాయం. ఇంగ్లండ్ గడ్డపై కేన్ విలియమ్సన్ పేలవ ఫామ్ కివీస్‌కు ప్రతికూలమైనా... డబ్ల్యూటీసీలో అతని రికార్డు సూపర్బ్‌గా ఉంది. 9 మ్యాచ్‌ల్లో కేన్ 817 రన్స్ చేశాడు.

ఇక రాస్ టేలర్ డబ్ల్యూటీసీ టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా అతని అనుభవం జట్టుకు కలిసి రానుంది. టాపార్డర్ విఫలమైన వేళ అతను జట్టుకు అండగా నిలబడగలడు. అంతేకాకుండా మెగా ఫైనల్లో ఒత్తిడి అధిగమించాలంటే రాస్ టేలర్ వంటి ఎక్స్‌పీరియన్స్ ప్లేయర్ ఉండాల్సిందే. హెన్రీ నికోల్స్ డిపెండబుల్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్. ఆచితూచి ఆడగలడు. డబ్ల్యూటీసీ టోర్నీలో సెంచరీలు కూడా చేశాడు. గత కొన్ని రోజులుగా కీపర్‌ కమ్ బ్యాట్స్‌మన్‌గా బీజే వాట్లింగ్‌ రాణిస్తు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

ఆల్‌రౌండర్లుగా ఆ ఇద్దరు..

ఆల్‌రౌండర్లుగా ఆ ఇద్దరు..

ఇక సౌతాంప్టన్ పిచ్.. మ్యాచ్ జరుగుతున్న కొద్ది స్పిన్‌కు అనుకూలిస్తుందని చరిత్ర చెబుతుంది. ఈ క్రమంలో కివీస్ ఐదుగురు పేసర్లకు బదులు ఓ స్పిన్నర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. ఆ లెక్కన ఆల్‌రౌండర్ల జాబితాలో లెగ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్, పేస్ ఆల్‌రౌండర్ కొలిన్ డీ గ్రాండ్ హోమ్‌కు చోటు దక్కనుంది. డీ గ్రాండ్ హోమ్ అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బంతితోను రాణించగలడు.

సాంట్నర్‌కు కూడా స్పిన్ బౌలింగ్‌తో పాటు బ్యాట్‌తో రాణించే సత్తా ఉంది. ఇక ఐదుగురు పేసర్లతో బరిలోకి దిగితే మాత్రం సాంట్నర్ స్థానంలో నీల్ వాగ్నర్ చోటు దక్కకపోవచ్చు. అయితే పిచ్ చాలా డ్రైగా ఉండే అవకాశం ఉన్ననేపథ్యంలో సాంట్నర్ తుది జట్టులో ఉండటం ఖాయం.

జెమీసన్, సౌథీ, బౌల్ట్.. పేస్ త్రయం

జెమీసన్, సౌథీ, బౌల్ట్.. పేస్ త్రయం

కైల్ జెమీసన్, టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్‌లతో కూడిన పేస్ త్రయంతో కివీస్.. భారత్‌పైకి దాడికి దిగనుంది. జెమీసన్ సత్తా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. భారత్‌పైనే గతేడాది ఆరంభంలో అరంగేట్రం చేసిన జెమీసన్ దుమ్మురేపాడు. ఇప్పటి వరకు ఆరు టెస్ట్‌లే ఆడిన ఈ కివీస్ యువ పేసర్ 36 వికెట్లు తీశాడు. అంతేకాకుండా బ్యాటింగ్‌లోనూ 50 సగటుతో పరుగులు చేశాడు. అతను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే భారత్‌కు కష్టాలు తప్పవు.

ఇంగ్లీష్ గడ్డపై సౌథీ డెంజరెస్ బౌలర్. తన స్వింగ్ సామర్థ్యంతో ప్రత్యర్థిని దెబ్బతీయగలడు. ఇక బౌల్డ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో అతను భారత్‌కు చేసిన నష్టాన్ని అభిమానులు ఇంకా మరిచిపోలేదు. రెండు వైపుల స్వింగ్ చేయగల బౌల్ట్‌తో భారత్‌కు కష్టాలు తప్పవు.

న్యూజిలాండ్ తుది జట్టు(అంచనా)

టామ్ లాథమ్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, హెన్రీ నికోల్స్, బీజే వాట్లింగ్(కీపర్), మిచెల్ సాంట్నర్, కొలిన్ డీ గ్రాండ్ హోమ్, కైల్ జెమీసన్, టీమ్ సౌథీ, ట్రెంట్ బౌల్ట్

Story first published: Tuesday, June 8, 2021, 13:31 [IST]
Other articles published on Jun 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+