న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరల్డ్ టీ20 కాదు... టీ20 వరల్డ్‌కప్: వరల్డ్‌కప్‌ పేర్లలో మార్పులు

World T20 renamed as T20 World Cup

హైదరాబాద్: వరల్డ్‌ టీ20 చాంపియన్‌షి‌ప్‌ను టీ20 వరల్డ్‌ కప్‌గా పేరు మార్చుతూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐసీసీ అధికారిక ప్రకటన చేసింది. ఆస్ట్రేలియాలో 2020లో జరగబోయే ఈ టోర్నమెంట్‌లో ఐసీసీ మహిళా టీ20 వరల్డ్ కప్, ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్‌గా పిలుస్తారని ఐసీసీ ఓ ప్రకటనలో పేర్కొంది.

వన్డే, టెస్టు ఫార్మాట్‌లతో సమానంగా పేరు రావాలనే

వన్డే, టెస్టు ఫార్మాట్‌లతో సమానంగా పేరు రావాలనే

వన్డే, టెస్టు ఫార్మాట్‌లతో సమానంగా పేరు రావాలనే ఉద్దేశంతో ఇలా చేశామని, సభ్యదేశాల మధ్య జరిగే అన్ని ‌టీ20 మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదా ఇచ్చేందుకు ఐసీసీ గతంలోనే అనుమతించిందని ఐసీసీ సీఈఓ డేవిడ్ రిచర్డ్‌సన్ వెల్లడించారు. 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్ టోర్నీని ‘వరల్డ్‌కప్' అని అంటారని ఆయన తెలిపారు.

 104 సభ్యదేశాలకు ప్రాంతీయ అర్హత పోటీల ప్రక్రియను

104 సభ్యదేశాలకు ప్రాంతీయ అర్హత పోటీల ప్రక్రియను

వచ్చే ఏడాది నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఆరంభం కానున్న నేపథ్యంలో 104 సభ్యదేశాలకు ప్రాంతీయ అర్హత పోటీల ప్రక్రియను ఏర్పాటు చేస్తూ ఐసీసీ ఈ కీలక నిర్ణయం తీసుకుందని తెలిపారు. టీ20 క్రికెట్ ఆడే దేశాల మధ్య టీ20 స్టేటస్‌ను ఇచ్చేందుకు ఐసీసీ బోర్డు ఇప్పటికే ఆమోదించిందని అన్నారు.

మూడో టెస్టు: సెంచరీతో విమర్శకుల నోరు మూయించిన బెయిర్‌స్టో

ఐసీసీ క్రికెట్‌ టోర్నీల పేర్ల మార్చుతూ ఐసీసీ బోర్డు నిర్ణయం

ఐసీసీ క్రికెట్‌ టోర్నీల పేర్ల మార్చుతూ ఐసీసీ బోర్డు నిర్ణయం

ఐసీసీ క్రికెట్‌ టోర్నీల పేర్ల మార్చుతూ ఐసీసీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అంతర్జాతీయ జట్లకు చెందిన కెప్టెన్లు ఆహ్వానిస్తున్నారు. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డుప్లెసిస్‌లు ఐసీసీ మార్పులను అందరికంటే ముందుగానే స్వాగతించారు.

 కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ "ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నా. టీ20 క్రికెట్‌కు మూలస్థంభంలా ఉండే ఈ టోర్నీని ఇప్పుడు వరల్డ్ కప్‌గా పిలవనున్నారు. 2007లో ఆరంభ ఎడిషన్ వరల్డ్ టీ20ని భారత్ గెలిచింది. ఆస్ట్రేలియా గడ్డపై టీ20 వరల్డ్ గెలిస్తే అదొక గొప్ప మూమెంట్" అని అన్నాడు.

Story first published: Wednesday, December 18, 2019, 18:23 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X