For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మూడో టెస్టు: సెంచరీతో విమర్శకుల నోరు మూయించిన బెయిర్‌స్టో

Sri Lanka v England: Jonny Bairstow proud of century after being castigated

హైదరాబాద్: కొలంబో వేదికగా శ్రీలంకతో శుక్రవారం ప్రారంభమైన మూడో టెస్ట్‌లో ఇంగ్లాండ్ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో జానీ బెయిర్‌స్టో (110) సెంచరీతో చెలరేగడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 88.1 ఓవర్లలో 7 వికెట్లకు 312 పరుగులు చేసింది.

మొయిన్ అలీ (23 బ్యాటింగ్), రషీద్ (13 బ్యాటింగ్) పరుగులతో క్రీజులో ఉన్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ ఓపెనర్లు బర్న్స్ (14), జెన్నింగ్స్ (13) మంచి శుభారంభం ఇవ్వడంలో పూర్తిగా విఫలమయ్యారు. అనంతరం క్రీజులోకి వచ్చిన బెయిర్‌స్టో కెప్టెన్ జో రూట్ (46)తో కలిసి మూడో వికెట్‌కు 100, స్టోక్స్ (57)తో కలిసి నాలుగో వికెట్‌కు 99 పరుగులు జోడించాడు.

ఇక, మూడో సెషన్‌లో శ్రీలంక బౌలర్లు పుంజుకోవడంతో 77 పరుగుల తేడాలో ఇంగ్లాండ్ 4 కీలక వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ జో రూట్ (46) రాణించగా, బెన్‌స్టోక్స్‌ (57) హాఫ్ సెంచరీ సాధించాడు. జోస్ బట్లర్ (16), ఫోక్స్ (13), తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. లంక బౌలర్లలో సందకన్‌ 4 వికెట్లు, పుష్పకుమార 2 వికెట్లు తీశారు.

Story first published: Saturday, November 24, 2018, 11:47 [IST]
Other articles published on Nov 24, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+