For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ బెస్ట్ బ్యాట్స్‌మన్‌యే కాదు.. చెత్త ప్రవర్తన కలిగిన..'

Worlds Worst Behaved Player: Naseeruddin Shah Slams Virat Kohli

ముంబై: భారత్‌, ఆస్ట్రేలియా రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ వరకూ హోరాహోరీగా సాగినా రెండో ఇన్నింగ్స్ మాత్రం పేలవరీతిలో ముగిసింది. బౌలర్లు చురకత్తుల్లాంటి బంతులతో భారత బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. బ్యాట్స్‌మెన్‌ పరుగులు చేసేందుకు యత్నిస్తున్నా.. పెర్త్‌లో 38 డిగ్రీల ఎండ వేడి ఆటగాళ్లలో క్రీడోత్సాహాన్ని మరింత పెంచింది. వీటికి తోడుగా ఇరు జట్ల కెప్టెన్లు కోహ్లీ, టిమ్‌పైన్‌ మధ్య జరిగిన మాటల యుద్ధం మరింత వేడిని పెంచింది. మూడో రోజు మొదలైన ఈ సమరం నాలుగో రోజూ కొనసాగింది.

నాకీ దేశం వదిలివెళ్లే ఉద్దేశం లేదు

ఈ క్రమంలో ప్రత్యర్థి ఆటగాళ్లను కవ్వించిన కోహ్లీ ప్రవర్తన పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. విరాట్‌ కోహ్లీ ప్రవర్తనను బాలీవుడ్‌ నటుడు నసీరుద్దీన్‌ షా తప్పుబట్టాడు. అతడు ‘ప్రపంచంలోనే అత్యంత చెత్త ప్రవర్తన కలిగిన ఆటగాడు' అని అంటున్నాడు. ‘విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ ఆటగాడు మాత్రమే కాదు అత్యంత చెత్త ప్రవర్తన కలిగిన ఆటగాడు. అతడి అహంకారం, అమర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తున్న తీరు అతడి క్రికెట్‌ నైపుణ్యాలని మసకబారుస్తున్నాయి. మరో విషయం. నాకీ దేశం వదిలివెళ్లే ఉద్దేశం లేదు' అని ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు.

పెర్త్ వేదికగా రెండో టెస్టు విజయంతో భారత పతనాన్ని శాసించిన ఆస్ట్రేలియా

కోహ్లీ అంటే మీకు కూడా నచ్చదు కదా

కోహ్లీ అంటే మీకు కూడా నచ్చదు కదా

అంతకుముందు ట్విట్టర్ వేదికగా ఓ వ్యక్తి వ్యాఖ్యలకు స్పందించిన విరాట్.. దేశం విడిచి వెళ్లిపొమ్మన్న వ్యాఖ్యలు లేకపోలేదు. అయితే కోహ్లీతో పాటుగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైనె కూడా స్టెడ్జింగ్ తరహాలో మురళీ విజయ్ వద్ద వ్యవహరించాడు. బ్యాటింగ్ చేసేందుకు వచ్చిన విజయ్‌ను కోహ్లీ అంటే మీకు కూడా నచ్చదు కదా అంటూ రెచ్చగొట్టే యత్నం చేశాడు. అసలు ఈ వివాదానికి కారణం.. కోహ్లీ కొట్టిన షాట్‌ను క్యాచ్ అందుకునే క్రమంలో నేలకు తాకిన తర్వాత కూడా అవుట్‌గా ప్రకటించడంతో ఆ విషయం పట్ల కోహ్లీ అసంతృప్తితో ఉండటమే దీనికి కారణం.

రెండో ఇన్నింగ్స్‌లో 140పరుగులకే

రెండో ఇన్నింగ్స్‌లో 140పరుగులకే

ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు చివరి మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లోనే వెనుకబడి ఉన్న టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా చేజార్చుకుంది.ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాజయానికి గురైంది. 146 పరుగుల తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 140పరుగులకే కుప్పకూలింది.

నిరాశపరిచిన టెయిలెండర్లు

నిరాశపరిచిన టెయిలెండర్లు

మంగళవారం ఉదయం 112/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరిరోజు బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా కేవలం 28 పరుగులు మాత్రమే జోడించింది. హనుమ విహారి-పంత్‌ జోడీ కాసేపు క్రీజులో నిలబడినా పరుగులు మాత్రం రాలేదు. వీరిద్దరి జోడీ పెవిలియన్‌ చేరిన తర్వాత టెయిలెండర్లు యథావిధిగా ఏమాత్రం ఆకట్టుకోకుండానే పెవిలియన్ చేరారు. ఉమేశ్‌యాదవ్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇషాంత్‌, బుమ్రా డకౌట్‌గా వెనుదిరగటంతో టీమిండియా 140 పరుగులకే కుప్పకూలింది.

1
43624
Story first published: Tuesday, December 18, 2018, 10:14 [IST]
Other articles published on Dec 18, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+