న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పెర్త్ వేదికగా రెండో టెస్టు విజయంతో భారత పతనాన్ని శాసించిన ఆస్ట్రేలియా

India vs Australia 2nd Test : India Lose By 146 Runs, Series Level At 1-1 | Oneindia Telugu
India vs Australia, 2nd Test, Day 5 in Perth: India blown away, lose by 146 runs

పెర్త్: ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టు చివరి మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని అందుకోలేకపోయింది. తొలి ఇన్నింగ్స్‌లోనే వెనుకబడి ఉన్న టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా చేజార్చుకుంది.ఆసీస్‌తో జరిగిన రెండో టెస్టులో టీమిండియా ఘోర పరాజయానికి గురైంది. 146 పరుగుల తేడాతో ఆసీస్‌ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో 140పరుగులకే కుప్పకూలింది.

మంగళవారం ఉదయం 112/5 ఓవర్‌నైట్‌ స్కోరుతో చివరిరోజు బ్యాటింగ్‌ మొదలుపెట్టిన టీమిండియా కేవలం 28 పరుగులు మాత్రమే జోడించింది. హనుమ విహారి-పంత్‌ జోడీ కాసేపు క్రీజులో నిలబడినా పరుగులు మాత్రం రాలేదు. వీరిద్దరి జోడీ పెవిలియన్‌ చేరిన తర్వాత టెయిలెండర్లు యథావిధిగా ఏమాత్రం ఆకట్టుకోకుండానే పెవిలియన్ చేరారు. ఉమేశ్‌యాదవ్‌ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఇషాంత్‌, బుమ్రా డకౌట్‌గా వెనుదిరగటంతో టీమిండియా 140 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌ 3, నాథన్‌ 3, హేజిల్‌వుడ్‌ 2, కమిన్స్‌ 2 వికెట్లు తీసుకున్నారు.

1
43624

శుక్రవారం ఆరంభమైన ఈ టెస్టు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకి ఆలౌటవగా.. భారత్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 283 పరుగులకే చేతులెత్తేసింది. దీంతో.. 43 పరుగుల ఆధిక్యాన్ని అందుకున్న ఆస్ట్రేలియా జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 243 పరుగులకి ఆలౌటై.. భారత్‌కి 287 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. సుదీర్ఘ టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ జట్టు ఇంత పెద్ద లక్ష్యాన్ని ఇప్పటి వరకూ ఛేదించలేదు. అడిలైడ్ వేదికగా గత వారం ముగిసిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ జట్టు 31 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే.

Story first published: Tuesday, December 18, 2018, 9:44 [IST]
Other articles published on Dec 18, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X