గత రెండేళ్లలో ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమే అతిపెద్ద నిరాశ: రవిశాస్త్రి

ఆంటిగ్వా: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోవడమే తన రెండేళ్ల కోచింగ్ పర్యవేక్షణలో అతి పెద్ద నిరాశ అని హెడ్ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నారు. కేవలం 30 నిమిషాల ఆటే తమ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుందని రవిశాస్త్రి తెలిపారు. గత రెండేండ్లుగా భారత హెడ్ కోచ్‌గా పనిచేసిన రవిశాస్త్రినే తిరిగి రెండేండ్ల కాలానికి కపిల్‌దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా కమిటీ (సీఏసీ) కోచ్‌గా ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

ఆ ఓటమే అది పెద్ద పరాభవం:
2021 టీ20 ప్రపంచకప్ దాకా కోచ్‌గా నియమితులయ్యాక రవిశాస్త్రి బీసీసీఐ టీవీతో మాట్లాడారు. 'ప్రపంచకప్-2019లో లీగ్ దశలో కేవలం ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయినా.. మనం టాప్‌లో నిలిచాం. ఇతర జట్టు కంటే ఎక్కువ మ్యాచ్‌లు కూడా గెలిచాం. కానీ.. ఒక చెడు రోజు, ఒక చెడు సెషన్ ద్వారా టోర్నీ నుండి బయటకు వచ్చాం. సెమీస్‌లో న్యూజిలాండ్ చేతిలో చివరి వరకు పోరాడి ఓడిపోయాం. కేవలం 30 నిమిషాల ఆట మా కలల్ని ఆవిరి చేసింది. నా గత రెండేళ్ల కోచింగ్ కెరీర్‌లో ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమే అది పెద్ద పరాభవం' అని రవిశాస్త్రి తెలిపారు.

వాటికే తొలి ప్రాధాన్యత:
'వచ్చే రెండేళ్లలో రెండు ఐసీసీ టోర్నమెంట్‌లు ఉన్నాయి. 2021లో టీ20 వరల్డ్‌కప్ జరుగనుంది. ఇప్పటికే టెస్టు చాంపియన్‌షిప్ కూడా మొదలైంది. ప్రస్తుతం ఈ రెండింటికే తొలి ప్రాధాన్యత ఉంటుంది. వాటికి అనుగుణంగా సన్నద్ధం కావడమే నా ముందున్న లక్ష్యం. మాకు అద్భుత టెస్ట్ జట్టు ఉంది. ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్నాం కాబట్టి దానిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. టీ20లో సరికొత్త దృక్పథాన్ని తీసుకురావాలి. ఆటగాళ్ల అద్భుతమైన ప్రతిభను బయటకు తీయాలి' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.

అదే నా కోరిక:
'నాపై విశ్వాసం ఉంచి తిరిగి కోచ్‌గా ఎంపిక చేసిన సీఏసీకి ధన్యవాదాలు. భారత జట్టులో భాగమవ్వడం నాకు ఎంతో గౌరవం మరియు గర్వకారణం. జట్టుపై విశ్వాసం ఉంది కాబట్టే మళ్లీ తిరిగొచ్చా. గతంలో కొన్ని జట్ల మాదిరిగా ప్రస్తుత జట్టు కూడా ఓ బలమైన వారసత్వం నెలకొల్పుతుందన్న నమ్మకం ఉంది. బాగా ఆడటమే కాదు భవిష్యత్తు తరాలు కొనసాగించేలా వారి వారసత్వం ఉండాలి. అదే నా కోరిక' అని రవిశాస్త్రి తెలిపారు.
పుజారా సెంచరీ, రోహిత్ హాఫ్ సెంచరీ.. భారీ స్కోర్ దిశగా భారత్

నలుగురు బౌలర్లను గుర్తించాల్సి:
'టెస్టు, వన్డే, టీ20 జట్లలోకి చాలామంది యువకులు వస్తున్నారు. వచ్చే రెండేళ్లు జట్టుకు సంధికాలం. భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలిచే పటిష్ఠ జట్టును రూపొందించడమే నా పని. ఈ 25-26 నెలల్లో జట్టును అత్యంత సంతోషంగా ఉంచడమే నా లక్ష్యం. అప్పుడే బలమైన వారసత్వాన్ని నెలకొల్పేందుకు సమయం వస్తుంది. ఇది అత్యంత సవాల్. సవాళ్లను నేనిష్టపడతా. జట్టు కోసం ఎటువంటి ప్రయోగాలకైనా సిద్ధం. నా పదవీకాలం ముగిసేలోపు సత్తా కలిగిన ముగ్గురు, నలుగురు బౌలర్లను గుర్తించాల్సి ఉంది' అని రవిశాస్త్రి పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications