
నిరాశపరిచిన రహానే:
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (12) వికెట్‌ను త్వరగానే కోల్పోయింది. అగర్వాల్ జట్టు స్కోర్ 36 పరుగుల వద్ద కార్టర్ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. దూకుడుగా ఆడిన మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (46 బంతుల్లో 36; 5 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ అజింక్య రహానే (1)లు ఒక్క పరుగు వ్యవధిలో పెవిలియన్ చేరి తీవ్రంగా నిరాశపర్చారు. కేవలం 6 బంతులు మాత్రమే ఆడిన రహానే కార్టర్ బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు.

ఆదుకున్న పుజారా:
53 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును పుజారా, రోహిత్‌లు అద్భుతంగా ఆడి ఆదుకున్నారు. ఈ జోడి విండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఈ క్రమంలో నాలుగో వికెట్‌కు 132 పరుగులు జోడించారు. రోహిత్ తన ఫామ్ కొనసాగిస్తూ.. ధాటిగా ఆడాడు. రోహిత్ ఔటయ్యాక హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారీ (37; 101 బంతుల్లో 2X4)తో కలిసి పుజారా సెంచరీ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. చాలాకాలం తర్వాత మైదానంలోకి దిగిన పుజారా తన ఫామ్‌ను చాటుకున్నాడు.

భారీ స్కోర్ దిశగా:
పుజారా అనంతరం క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (33) విహారీకి అండగా నిలిచాడు. అయితే భారీ షాట్ ఆడే క్రమంలో పెవిలియన్ చేరాడు. అనంతరం రవీంద్ర జడేజా మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. విహారీ (37), జడేజా (1) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. చేతిలో ఇంకా ఐదు వికెట్లు ఉన్న నేపథ్యంలో భారత్ భారీ స్కోర్ దిశగా అడుగులు వేస్తోంది. విండీస్ బౌలర్లలో కార్టర్ మూడు వికెట్లు.. హార్డింగ్, అకిం ఫ్రాజర్ తలో వికెట్ తీశారు.
పవన్ షెరావత్ విజృంభణ.. తలైవాస్‌ను చిత్తు చేసిన బుల్స్

కోహ్లీ దూరం:
బుధవారం జరిగిన చివరి వన్డేలో స్వల్పంగా గాయపడ్డ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఈ సన్నాహక మ్యాచ్‌కు దూరమయ్యాడు. సారథ్య బాధ్యతలను రహానే నిర్వర్తించాడు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా భారత్, విండీస్ మధ్య ఈనెల 22న తొలి టెస్టు ప్రారంభం కానుంది. టెస్టు సిరీస్‌ను కూడా భారత్ చేజిక్కించుకుంటే.. ఒకే పర్యటనలో విండీస్ గడ్డపై మూడు ఫార్మాట్ల సిరీస్‌లను తొలిసారి గెలుచుకున్న రికార్డును కోహ్లీ సేన సృష్టిస్తుంది.


Click it and Unblock the Notifications












