Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup qualifiers: నెదర్లాండ్స్ సంచలన విజయం.. ఇండియాకు సలామ్!

బులవాయో: వన్డే ప్రపంచకప్‌ 2023కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్ దుమ్మురేపింది. ప్రపంచకప్ క్వాలిఫయర్స్ సూపర్ సిక్స్‌లో సంచలన విజయాలతో వెస్టిండీస్, జింబాబ్వేలను మట్టికరిపించిన స్కాట్‌లాండ్‌కు నెదర్లాండ్స్ దిమ్మతిరిగే షాకిచ్చింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగిన నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌ను ఓడించి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.

విజయానంతరం 'నమస్తే ఇండియా'పోస్టర్‌‌తో ఫోజిచ్చిన నెదర్లాండ్స్ ఐదో సారి ప్రపంచకప్ బరిలోకి దిగే అవకాశాన్ని అందుకుంది. 'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' బాస్‌ డె లీడ్‌ (92 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్స్‌తో 123, 5/52) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బ్యాటింగ్‌లో శతక్కొట్టిన అతను బౌలింగ్‌లో ఐదు వికెట్లతో స్కాట్‌లాండ్ పతనాన్ని శాసించాడు.

World Cup qualifiers

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన స్కాట్‌లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. బ్రాండన్‌ మెక్‌ములెన్‌ (110 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 106) సెంచరీతో సత్తాచాటాడు. కెప్టెన్‌ బెరింగ్టన్‌ (64) కూడా రాణించాడు. బాస్‌ డె లీడ్‌ ఆ జట్టును కట్టడి చేశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ 42.5 ఓవర్లలో లక్ష్యాన్ని చేదించి ప్రపంచకప్‌ బెర్త్‌ను కొట్టేసింది.

278 పరుగుల లక్ష్యచేధనకు దిగిన నెదర్లాండ్స్ ప్రపంచకప్‌కు అర్హత సాధించాలంటే 44 ఓవర్లలోపే విజయాన్నందుకోవాలి. కానీ 31 ఓవర్లకు 164/5తో ఆ జట్టు కష్టాల్లో పడింది. అప్పటికీ లీడ్‌ 52 బంతుల్లో 47 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. నెదర్లాండ్స్‌ గెలుపు కష్టమేనని అంతా భావించారు. కానీ ఆ తర్వాతే దూకుడు పెంచిన లీడ్‌ ఎడాపెడా బౌండరీలు బాదాడు. సిక్సర్లతో చెలరేగాడు.

World Cup qualifiers

సకీబ్‌ (33 నాటౌట్‌)తో కలిసి అతను ఆరో వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 113 పరుగులు జోడించాడు. దీంతో 42.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకున్న నెదర్లాండ్స్‌ ప్రపంచకప్‌ బెర్తు కొట్టేసింది.

శ్రీలంక ఇప్పటికే ప్రపంచకప్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు నెదర్లాండ్స్‌ (నెట్‌ రన్‌రేట్‌ 0.160)తో పాటు స్కాట్లాండ్‌ (0.102), జింబాబ్వే (-0.099) తలో 6 పాయింట్లతో సమానంగా నిలిచాయి. కానీ మెరుగైన నెట్‌ రన్‌రేట్‌తో నెదర్లాండ్స్‌ ముందంజ వేసింది. ఆ జట్టు 1996, 2003, 2007, 2011 ప్రపంచకప్‌ల్లోనూ ఆడింది. ఈ విజయానంతరం నెదర్లాండ్స్ ఆటగాళ్లంతా నమస్తే ఇండియా అనే పోస్టర్‌కు ఫోజివ్వడం చర్చనీయాంశమైంది.

Story first published: Friday, July 7, 2023, 10:51 [IST]
Other articles published on Jul 7, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+