Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: తళుక్కుమన్న క్రికెటర్ల సతీమణులు.. ఫొటోలు వైరల్!

చెన్నై: వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్- ఆస్ట్రేలియా‌ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో క్రికెటర్ల సతీమణులు తళుక్కుమన్నారు. తమ భర్తల ఆటను ప్రతక్ష్యంగా చూస్తూ.. భారత జట్టుకు మద్దతు తెలుపుతున్నారు. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతీ నారయణ్ తన కూతురితో కలిసి ఈ మ్యాచ్‌కు హాజరైంది.

చెన్నై అశ్విన్ హోమ్ టౌన్ కావడంతో అతని కుటుంబ సభ్యులు ఈ మ్యాచ్‌కు వచ్చారు. టీమిండియా జెర్సీని ధరించిన ప్రీతీ నారయణ్.. గాగుల్స్ ధరించి అశ్విన్‌కు గ్యాలరీ నుంచి మద్దతు తెలుపుతోంది. ప్రస్తుతం ప్రీతీ నారయణ్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్దే సైతం ఈ మ్యాచ్‌కు హాజరైంది.

World Cup 2023: Wives of cricketers to cheer Team India in their opener vs Australia

సంప్రదాయక డెస్స్‌లో గాగుల్స్‌ ధరించి సీరియస్‌గా మ్యాచ్ చూస్తున్న ఆమె ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ మాత్రం ఈ మ్యాచ్‌కు హాజరు కాలేదు. ప్రతీ మ్యాచ్‌కు హాజరయ్యే ఆమె.. ఈ మ్యాచ్‌కు హాజరుకాకపోవడంపై అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. గర్భవతి కావడంతోనే మ్యాచ్‌కు రాలేదేమోనని అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ స్టన్నింగ్ క్యాచ్‌తో ఓపెనర్ మిచెల్ మార్ష్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన స్మిత్‌తో కలిసి వార్నర్ ఆచితూచి ఆడాడు. దాంతో పవర్ ప్లేలో ఆసీస్ వికెట్ నష్టానికి 43 పరుగులే చేసింది. అనంతరం రోహిత్ స్పిన్నర్లను బరిలోకి దింపగా ఈ జోడీ ఆచితూచి ఆడింది.

69 పరుగులతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని కుల్దీప్ యాదవ్ విడదీసాడు. హాఫ్ సెంచరీకి చేరువైన డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41)ను రిటర్న్ క్యాచ్‌గా బోల్తా కొట్టించాడు. దాంతో ఆసీస్ 74 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. క్రీజులో మార్నస్ లబుషేన్ రాగా.. స్మిత్ పోరాడుతున్నాడు.

Story first published: Sunday, October 8, 2023, 15:43 [IST]
Other articles published on Oct 8, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+