Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: భారత్ సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే..?

World Cup 2023: వన్డే ప్రపంచకప్ 2023లో సెమీస్ ఆడే జట్లు ఏవో దాదాపు ఖరారు అయ్యాయి. ఇప్పటికే భారత్, సౌతాఫ్రికా, ఆసీస్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా.. తాజాగా న్యూజిలాండ్ నాలుగో టీమ్‌గా సెమీస్‌కు అర్హత సాధించింది. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన న్యూజిలాండ్.. పాకిస్థాన్, అఫ్గానిస్థాన్‌‌లను వెనక్కనెట్టి సెమీస్‌కు దూసుకెళ్లింది.

అద్భుతం జరిగితే తప్పా న్యూజిలాండ్ సెమీస్ బెర్త్‌కు వచ్చే డోకా లేదు. పాకిస్థాన్ సెమీస్ చేరాలంటే క్రికెట్ చరిత్రలోనే కనివీని ఎరుగని విజయాన్ని అందుకోవాలి. ఇంగ్లండ్‌తో శనివారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 277 పరుగుల భారీ తేడాతో గెలుపొందాలి. అలా జరగాలంటే పాకిస్థాన్ 400 పరుగుల భారీ స్కోర్ చేసి.. ఇంగ్లండ్‌ను 130 పరుగులకు ఆలౌట్ చేయాలి.

World Cup 2023: Who will India face in semi-final? Date, Time and Venue Details

ముందుగా బౌలింగ్ చేస్తే మాత్రం ఇంగ్లండ్‌ను 50 పరుగులకు ఆలౌట్ చేసి 2.3 ఓవర్లలో చేధించాలి. ఏ లెక్కన చూసుకున్నా.. ఇది అసాధ్యం. మాజీ ఛాంపియన్ ఇంగ్లండ్‌ ఈ టోర్నీలో విఫలమైనా.. నెదర్లాండ్స్‌పై సాధించిన భారీ విజయంతో ఆ జట్టు ఫామ్‌లోకి వచ్చింది. పాకిస్థాన్ తలకిందులు తపస్సు చేసినా.. సెమీస్ చేరలేదు.

ఈ క్రమంలోనే న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖరారు అయినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భారత్ సెమీఫైనల్ అభ్యర్థి కూడా న్యూజిలాండేనని స్పష్టం చేస్తున్నారు. నవంబర్ 15న ముంబై వేదికగా జరిగే తొలి సెమీఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. 16న కోల్‌కతా వేదికగా జరిగే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, ఆసీస్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి.

World Cup 2023: Who will India face in semi-final? Date, Time and Venue Details

భారత్ సెమీస్ ప్రత్యర్థి న్యూజిలాండ్ అనగానే భారత అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. మెగా టోర్నీల్లో న్యూజిలాండ్‌పై టీమిండియాకు మెరుగైన రన్‌రేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ భయపడుతున్నారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో ఇదే న్యూజిలాండ్‌ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. 2021 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లోనూ న్యూజిలాండ్ చేతిలోనే ఓడి.. టైటిల్ చేజార్చుకుంది.

అయితే తాజా టోర్నీ లీగ్ దశలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా భారీ విజయం సాధించింది. అంతేకాకుండా భారత సమష్టి ప్రదర్శన ముందు ప్రత్యర్థి జట్లన్నీ కుదేలయ్యాయి. టీమిండియా తాజా ప్రదర్శన ముందు న్యూజిలాండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ అభిమానులకు ఎక్కడో భయం కలుగుతూనే ఉంది.

Story first published: Thursday, November 9, 2023, 20:46 [IST]
Other articles published on Nov 9, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+