Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: భారత్ కంటే పాకిస్థాన్ చాలా వీక్ టీమ్.. వకార్ యూనిస్ షాకింగ్ కామెంట్స్!

న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగే భారత్ జట్టుతో పోల్చితే పాకిస్థాన్ టీమ్ చాలా బలహీనంగా ఉందని ఆ జట్టు మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ తెలిపాడు. బౌలింగ్, బ్యాటింగ్ పరంగా చూసుకున్నా భారత్‌‌తో పాకిస్థాన్ టీమ్ సరితూగదని అభిప్రాయపడ్డాడు. అయితే కాస్త జాగ్రత్తగా ఆడితే ప్రపంచకప్‌లో భారత్‌ను ఓడించవచ్చని తెలిపాడు.

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య అక్టోబర్ 14న అహ్మదాబాద్ వేదికగా మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఓ చానెల్‌తో మాట్లాడిన వకార్ యూనిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'వరల్డ్ కప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ చాలా పెద్దది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులే కాకుండా యావత్ క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తికరంగా చూస్తోంది. నా దృష్టిలో ప్రపంచకప్‌లోనే ఇదే అత్యంత ప్రాధాన్యత కలిగిన మ్యాచ్.

World Cup 2023:

అహ్మదాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌లో పాకిస్థాన్ చాలా జాగ్రత్తగా ఆడాలి. టీమిండియా కంటే పాకిస్థాన్ చాలా బలహీనమైన జట్టు. కాబట్టి ఆచి తూచి ఆడితేనే గెలిచే అవకాశం ఉంటుంది. పాకిస్థాన్ కంటే మెరుగ్గా ఉన్నా.. టీమిండియా కూడా తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి ఉంటుంది. లక్షమంది సొంత అభిమానుల మధ్య మ్యాచ్ ఆడటం అంటే ఆశామాషి వ్యవహారం కాదు.

అభిమానుల అరుపులు, గోలలు ప్లేయర్లను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తాయి. చివరి నిమిషంలో నసీమ్ షా దూరమవడం పాకిస్థాన్‌కు కోలుకోలేని ఎదురు దెబ్బ. షాహీన్ ఆఫ్రిదీ, నసీమ్ షా ఇద్దరూ తొలి ఓవర్లలోనే వికెట్లు తీసేవారు. హసన్ ఆలీ వచ్చినా.. అతని అనుభవం జట్టుకు ఎంతగా ఉపయోగపడుతుందో చెప్పలేం.

ఇన్ని రోజులు జట్టుకు దూరంగా ఉండి, ఆకస్మాత్తుగా వచ్చి ఆడమంటే జట్టులో కుదురుకోవడానికి కూడా కొంత సమయం పడుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో నాకైతే భారత జట్టు, టాప్ క్లాస్ టీమ్‌గా కనబడుతోంది. రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఇద్దరూ కూడా టీమిండియాకు మ్యాచ్ విన్నర్లు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై వికెట్లు ఎలా తీయాలో ఈ ఇద్దరికి బాగా తెలుసు.' అని వకార్ యూనిస్ చెప్పుకొచ్చాడు.

Story first published: Friday, September 29, 2023, 19:32 [IST]
Other articles published on Sep 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+