Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: విరాట్ కోహ్లీ చెత్త రికార్డ్!

IND vs ENG: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ చెత్త రికార్డు నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(0) డకౌట్‌గా వెనుదిరిగాడు. డేవిడ్ విల్లే బౌలింగ్‌లో క్రీజు ధాటి ఆడే ప్రయత్నం చేసిన కోహ్లీ.. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేరాడు. 9 బంతులు ఆడిన కోహ్లీ ఖాతా తెరవకుండా ఔటయ్యాడు. దాంతో కోహ్లీ తన పేరిట చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

వన్డే ప్రపంచకప్ చరిత్రలోనే కోహ్లీ తొలి సారి డకౌటయ్యాడు. ఇప్పటి వరకూ వన్డే, టీ20 ప్రపంచకప్‍లలో కలిపి 56 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లి.. తొలిసారిగా డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో సచిన్ సెంచరీల రికార్డును విరాట్ సమం చేస్తాడని ఆశించిన అభిమానులు.. తీవ్ర నిరాశకు గురయ్యారు. కోహ్లీ డకౌటవ్వడంతో ట్విటర్‌లో ‍‌ డక్ పదం ట్రెండింగ్‌గా మారింది.

 World Cup 2023: Virat Kohli registers first duck in World Cup history

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. తొమ్మిది పరుగులు చేసిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్.. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన కోహ్లీ సైతం తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో పవర్ ప్లేలో టీమిండియా 2 వికెట్లకు 35 పరుగులే చేసింది.

ఆ వెంటనే శ్రేయస్ అయ్యర్(4)ను క్రిస్ వోక్స్ షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. ఈ పరిస్థితుల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో 66 బంతుల్లో రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 91 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని డేవిడ్ విల్లే విడదీసాడు.

కేఎల్ రాహుల్(39)ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఇక సెంచరీ దిశగా దూసుకెళ్తున్న రోహిత్ శర్మ(87)ను ఆదిల్ రషీద్.. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన షమీ(1) కూడా ఔటవ్వడంతో బుమ్రాతో కలిసి సూర్యకుమార్ యాదవ్ పోరాడాడు.

Story first published: Sunday, October 29, 2023, 17:49 [IST]
Other articles published on Oct 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+