న్యూఢిల్లీ: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో ప్రముఖ వ్యాపార సంస్థ పుమా రూపొందించిన యాడ్‌పై సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ జరిగింది. పుమా ఉత్పత్పులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న విరాట్ కోహ్లీతో మొదలైన ఈ చర్చ.. యువీ కామెంట్‌తో ముగిసింది.
ప్రపంచకప్ నేపథ్యంలో పుమా తమ లోగోకు సంబంధించి ఆసక్తికర కంటేస్ట్ రూపొందించింది. ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఏదైనా డైవ్‌ను క్యాప్చర్ చేసి #PUMADiveతో ఎక్స్‌లో పంచుకుంటే లక్కీ విన్నర్స్‌కు రివార్డ్స్ లభిస్తాయని పేర్కొంది. అంతేకాకుండా విరాట్ కోహ్లీతో క్రికెట్ ఆడే అవకాశం కూడా దక్కుతుందని తెలిపింది. అంతేకాకుండా క్రికెట్‌లో ప్రతీ డైవ్ పుమా డైవేనని రాసుకొచ్చింది. విరాట్ కోహ్లీ డైవ్స్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియోపై స్పందించిన విరాట్ కోహ్లీ.. పుమా యాడ్ షూట్‌కు సంబంధించిన డైవ్ ఫొటోను షేర్ చేసి.. ఇది కచ్చితంగా పుమా డైవే. మీరు ఏం అనుకుంటున్నారు? అని ప్రశ్నించాడు.
ఈ పోస్ట్ స్పందించిన లెజండరీ ఫీల్డర్ జాంటీ రోడ్స్.. తన ఫీల్డింగ్ విన్యాసానికి సంబంధించిన ఫొటోను పంచుకున్నాడు. 'కోహ్లీ ఇది అద్భుతం. నాకు కూడా ఇలాంటి ఫీల్డింగ్ ఫీట్ ఉంది. ప్రత్యేక జ్ఞాపకాలను నెమరువేసుకోవడానికి మంచి ప్రయత్నం. ఈ ఏడాది నువ్వు ఇలాంటి ఫీట్స్ సాధిస్తావని ఆశిస్తున్నా. అయితే మా సౌతాఫ్రికాపై మాత్రం చేయవద్దని భావిస్తున్నా.'అని జాంటీ రోడ్స్ చెప్పుకొచ్చాడు.
ఈ పుమాడైవ్ కాంటేస్ట్‌లో యువరాజ్ సింగ్ కూడా పాల్గొన్నాడు. జాంటీ రోడ్స్ ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. ది లెజెండ్ జాంటీ సింగ్.. డైవ్ ఎలా చేయాలో నిన్ను చూసి నేర్చుకున్నాడు.'తన డైవ్‌కు సంబంధించిన ఫొటోను పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి.