చెన్నై: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఐసీసీ వైట్‌బాల్ టోర్నీలో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ క్రమంలో క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇక ఐసీసీ మెగాటోర్నీల్లో సచిన్ టెండూల్కర్ 58 ఇన్నింగ్స్‌ల్లో 2719 రన్స్ చేయగా.. కోహ్లీ 64 ఇన్నింగ్స్‌ల్లో 2730 ప్లస్ రన్స్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 64 ఇన్నింగ్స్‌ల్లో 2422 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

ఐసీసీ వైట్ బాల్ టోర్నీల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులే కాకుండా అత్యధిక 50 ప్లస్ రన్స్, బెస్ట్ యావరేజ్, అత్యధిక మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు అందుకున్న ప్లేయర్‌గా కూడా కోహ్లీ నిలిచాడు.
ఇక వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అత్యంత వేగంగా 11 వేల పరుగుల మైలు రాయి అందుకున్న బ్యాటర్‌గా రికార్డు సాధించాడు.
200 స్వల్ప లక్ష్యచేధనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. 2 పరుగుల వ్యవధిలోనే టాప్-3 వికెట్లు కోల్పోయింది. ఆసీస్ పేసర్ల ధాటికి ముగ్గురు బ్యాటర్ల డకౌట్‌గా వెనుదిరిగారు. మిచెల్ స్టార్క్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో ఓపెనర్ ఇషాన్ కిషన్(0) గోల్డెన్ డక్‌గా వెనుదిరగ్గా.. హజెల్ వుడ్ వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ శర్మ కూడా డకౌటయ్యాడు.
అతను ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఇదే ఓవర్ చివరి బంతికి క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ కూడా చెత్త షాట్‌తో డకౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో కేఎల్ రాహుల్‌తో కలిసి కోహ్లీ భారత జట్టును ఆదుకున్నాడు. హజెల్ వుడ్ వేసిన 8వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ ఇచ్చిన సునాయస క్యాచ్‌ను మిచెల్ మార్ష్ నేలపాలు చేశాడు.
ఈ అవకాశంతో చెలరేగిన కోహ్లీ.. 75 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు కేఎల్ రాహుల్ సైతం హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. ఈ మ్యాచ్‌లు ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 49.3 ఓవర్లలో 199 పరుగులకు కుప్పకూలింది. స్టీవ్ స్మిత్(71 బంతుల్లో 5 ఫోర్లతో 46), డేవిడ్ వార్నర్(52 బంతుల్లో 6 ఫోర్లతో 41) టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో మిచెల్ స్టార్క్(35 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 28) విలువైన పరుగులు జోడించాడు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/28) మూడు వికెట్లుతీయగా.. కుల్దీప్ యాదవ్(2/42), జస్‌ప్రీత్ బుమ్రా(2/35) రెండేసి వికెట్లు తీసారు. మహమ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ తలో వికెట్ పడగొట్టారు.