హైదరాబాద్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే ప్రపంచకప్ 2023 సమయం ఆసన్నమైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. ఇప్పటికే ప్రపంచకప్ బరిలోకి దిగే ఆయా జట్లు భారత్ చేరి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. వామప్ మ్యాచ్‌లు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ వేదికగా రెండు వామప్ మ్యాచ్‌లు.. మూడు ప్రధాన మ్యాచ్‌లు జరగనున్నాయి.
సెప్టెంబర్ 29 శుక్రవారం న్యూజిలాండ్, పాకిస్థాన్ జట్ల మధ్య వామప్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఇరు జట్లు ఈ రోజు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్నాయి.

ఉప్పల్ మ్యాచ్ వివరాలు..
సెప్టెంబర్ 29న పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య వార్మప్ మ్యాచ్
అక్టోబర్ 3న పాకిస్థాన్, ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్
ప్రధాన మ్యాచ్‌లు..
అక్టోబర్ 6న పాకిస్థాన్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్
అక్టోబర్ 9న న్యూజిలాండ్, నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్
అక్టోబర్ 10న పాకిస్థాన్, శ్రీలంక మధ్య మ్యాచ్
జట్టు బస చేసే హోటల్స్ ఇవే..
న్యూజిలాండ్ - ఐటీసీ కాకతీయ
పాకిస్థాన్ - పార్క్ హయత్
ఆస్ట్రేలియా - తాజ్ కృష్ణ
నెదర్లాండ్స్ - తాజ్ కృష్ణ
శ్రీలంక - శంషాబాద్ నోవాటెల్
ప్రపంచకప్ కోసం ఉప్పల్ మైదానం సిద్దమైంది. మైదానాన్ని పూర్తిగా రినోవేషన్ చేసారు. సీట్లు, గ్రౌండ్ పైకప్పులు అన్ని కొత్తవి ఏర్పాటు చేశారు.