Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: అందుకే టీమిండియా బెస్ట్ ఫీల్డర్.. భారీ ప్లానే!

World Cup 2023 నేపథ్యంలో టీమిండియా ప్రవేశ పెట్టిన బెస్ట్ ఫీల్డర్ మెడల్ తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ మెడల్ ఇచ్చే సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్‌లో జరిగే సెలెబ్రేషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సంబరాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా‌లో సెన్సేషన్ అవుతున్నాయి.

అవార్డు ఇచ్చే పద్దతిలో కూడా టీమిండియా మేనేజ్‌మెంట్ వినూత్న పద్దతులను పాటిస్తుండటంతో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తున్నాయి. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు జరగ్గా.. ఐదుగురు ఆటగాళ్లు బెస్ట్ ఫీల్డర్ అవార్డులు అందుకున్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ తొలి గోల్డ్ మెడల్ అందుకోగా.. అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్‌ను ఈ అవార్డు వరించింది.

World Cup 2023: Story behind India ‘best fielder’ medal

పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌ను ఈ అవార్డును వరించగా.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రవీంద్ర జడేజా ఈ మెడల్‌ను అందుకున్నాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌ను ఈ అవార్డును వరించింది.

World Cup 2023: Story behind India ‘best fielder’ medal

కోహ్లీ, శార్దూల్, కేఎల్ రాహుల్‌కు సాధారణంగానే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ప్రశంసిస్తూ మెడల్ అందజేయగా.. జడేజా, అయ్యర్‌కు మాత్రం వినూత్నంగా ఈ మెడల్ ఇచ్చారు. జడేజా పట్టిన సూపర్ క్యాచ్‌ను మైదానంలో బిగ్ స్క్రీన్‌పై వేసి అతనికి ఈ మెడల్ అందేజేశారు. ఈ పద్దతిని భారత ఆటగాళ్లు తెగ ఎంజాయ్ చేయగా..ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

World Cup 2023: Story behind India ‘best fielder’ medal

ఇక శ్రేయస్ అయ్యర్‌కు స్పైడర్ కెమెరా సాయంతో ఈ అవార్డు అందజేయడం అందర్నీ ఆకట్టుకుంది. ఈ అవార్డు కోసం భారత ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎంతలా అంటే అద్భుత క్యాచ్ అందుకున్న ప్రతీ ప్లేయర్.. మెడల్ నాదే అంటూ డ్రెస్సింగ్ రూమ్ వైపు సైగలు చేస్తున్నారు.

టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు పెంచేందుకే మేనేజ్‌మెంట్ ఈ అవార్డు ప్రవేశ పెట్టింది. ఈ మెగా టోర్నీకి ముందు వెస్టిండీస్ పర్యటనలో, ఆసియాకప్ సందర్భంగా టీమిండియా ఫీల్డింగ్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. సునాయస క్యాచ్‌లు నేలపాలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే ఆటగాళ్ల ఫీల్డింగ్ మెరుగుపరిచేందుకు ఈ గోల్డ్ మెడల్ అవార్డును ప్రవేశపెట్టారు.

World Cup 2023: Story behind India ‘best fielder’ medal

గతంలో అద్భుతంగా ఫీల్డింగ్ చేసినవారిని డ్రెస్సింగ్ రూమ్‌లో కోచ్‌లు ప్రశంసించేవారు. అంతే తప్పా ఎలాంటి అవార్డు ఇచ్చేవారు కాదు. కానీ గోల్డ్ మెడల్ అవార్డు కారణంగా టీమిండియా ఫీల్డింగ్ ప్రమాణాలు మెరుగుపడ్డాయి. ఆటగాళ్ల మధ్య అవార్డు కోసం తీవ్ర పోటీ నెలకొంది. అంతేకాకుండా ఈ అవార్డు కారణంగా పేరు కూడా వస్తోంది. దాంతో ఆటగాళ్లు ఈ అవార్డు అందుకునేందుకు పోటీ పడుతున్నారు.

ఆటగాళ్ల మధ్య పోటీ వాతావరణం నెలకొల్పేందుకు.. డ్రెస్సింగ్ రూమ్‌లో మరింత జోష్ నింపేందుకు ఈ అవార్డు ప్రవేశపెట్టినట్లు బీసీసీఐ అధికారులు వివరణ ఇచ్చారు.

Story first published: Tuesday, October 24, 2023, 21:11 [IST]
Other articles published on Oct 24, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+