Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: మా జట్టు పరాజయాల వెనుక కుట్ర.. శ్రీలంక చీఫ్ సెలెక్టర్ సంచలన వ్యాఖ్యలు!

World Cup 2023: వన్డే ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవ ప్రదర్శన వెనుక కుట్ర ఉందని ఆ జట్టు చీఫ్ సెలెక్టర్ విక్రమ్ సింఘే సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆ కుట్రను గుర్తించి పూర్తి వివరాలు వెల్లడించేందుకు తనకు కాస్త సమయం కావాలని తెలిపాడు. ఇక ఈ మెగా టోర్నీలో శ్రీలంక దారుణంగా విఫలమైంది.

తొమ్మిది లీగ్ మ్యాచ్‌లకు రెండు మాత్రమే గెలిచి పాయింట్స్ టేబుల్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌పై విజయం సాధించిన శ్రీలంక మిగతా మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది.

World Cup 2023: Sri Lanka Chief Selector Blames External Conspiracy for Team Poor Show

ఈ పరాజయాల నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డును రద్దు చేస్తున్నట్లు ఆ దేశ క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే టీమ్ పేలవ ప్రదర్శన వెనుక రాజకీయ కుట్ర ఉందనిపిస్తోందని శ్రీలంక చీఫ్ సెలెక్టర్ ఆరోపించాడు.

'మా జట్టు దారుణ ప్రదర్శనకు నాదే బాధ్యత. అయితే ఈ ఘోర ప్రదర్శన వెనుక ఏదో కుట్ర దాగి ఉంది. దీని వెనుక బయట శక్తుల ప్రమేయం ఉన్నట్లు అనిపిస్తోంది. వీటి గురించి పూర్తిగా వెల్లడించేందుకు నాకు రెండు రోజుల సమయం కావాలి.'అని విక్రమసింఘే తెలిపాడు.

శ్రీలంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) కార్యవర్గం రద్దు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. బోర్డు రద్దు తీర్మానానికి శ్రీలంక పార్లమెంట్ ఏకగీవ్రంగా ఆమోదం తెలిపింది. అంతకుముందు షమ్మి సిల్వా సారథ్యంలోని ఎస్‌ఎల్‌సీ కార్యవర్గాన్ని అప్పీల్ కోర్ట్ పునరుద్దరించిన నేపథ్యంలో పార్లమెంట్ తీర్మానం ప్రాధాన్యం సంతరించుకుంది.

భారత్ చేతిలో ఘోర పరాజయం అనంతరం శ్రీలంక క్రీడల మంత్రి రోషన్ రణసింఘే ఎస్‌ఎల్‌సీ కార్యవర్గాన్ని రద్దు చేశారు. మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ సారథ్యంలో ఏడుగురు సభ్యులతో మధ్యంత కమిటీని నియమించారు.

Story first published: Friday, November 10, 2023, 19:23 [IST]
Other articles published on Nov 10, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+