For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: ఇంగ్లండ్‌ను ఇంటికి పంపించిన శ్రీలంక!

ENG vs SL: వన్డే ప్రపంచకప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. శ్రీలంక‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన ఇంగ్లండ్ 8 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. మెగా టోర్నీలో ఇంగ్లండ్‌కు ఇది నాలుగో పరాజయం. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌ల్లో 4 ఓడిన ఇంగ్లండ్.. సెమీస్ రేసు నుంచి తప్పుకుంది. చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచినా ఆ జట్టు సెమీస్ చేరే పరిస్థితి లేదు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 156 పరుగులకే కుప్పకూలింది. బెన్ స్టోక్స్(73 బంతుల్లో 6 ఫోర్లతో 43), జానీ బెయిర్ స్టో(31 బంతుల్లో 3 ఫోర్లతో 30) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
శ్రీలంక బౌలర్లలో లాహిరు కుమార(3/35), ఏంజెలో మాథ్యూస్(2/14), కాసున్ రజితా (2/36), మహీశ్ తీక్షణ(1/21) ఇంగ్లండ్ పతనాన్ని శాసించారు.

World Cup 2023: Sri Lanka beat England to put defending champions on brink of exit

అనంతరం లక్ష్యచేధనకు దిగిన శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసింది. పాతుమ్ నిస్సంక(83 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 77 నాటౌట్), సదీరవిక్రమా(54 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విల్లే(2/30) రెండేసి వికెట్లు తీసారు.

World Cup 2023: Sri Lanka beat England to put defending champions on brink of exit

స్వల్ప లక్ష్యచేధనలో శ్రీలంకకు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కుశాల్ పెరెరా(4), కెప్టెన్ కుశాల్ మెండీస్(11)లను డేవిడ్ విల్లే పెవిలియన్ చేర్చాడు. దాంతో శ్రీలంక 23 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో నిస్సంక, సమరవిక్రమా జట్టును ఆదుకున్నారు. అసాధారణ బ్యాటింగ్‌తో అదిరిపోయే విజయాన్ని అందించారు. 54 బంతుల్లో పాతుమ్ నిస్సంక హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. సమరవిక్రమా 44 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు.

Story first published: Thursday, October 26, 2023, 20:03 [IST]
Other articles published on Oct 26, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+