Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: శ్రీలంకతో వామప్ మ్యాచ్.. బంగ్లాదేశ్ ఘన విజయం!

గువాహటి: వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో శ్రీలంకతో జరిగిన వామప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. గువాహటి వేదికగా శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ముందు‌గా బ్యాటింగ్ చేసిన శ్రీలంక 49.1 ఓవర్లలో 263 పరుగులకు కుప్పకూలింది. ఓపెనర్ పాతుమ్ నిస్సంక(64 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 68), ధనంజయ డిసిల్వా(79 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 55) హాఫ్ సెంచరీలతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో మెహ్‌దీ హసన్(3/36) మూడు వికెట్లు తీయగా.. తంజీమ్ హసన్ షకీబ్, షోరిఫుల్ ఇస్లామ్, నాసుమ్ అహ్మద్, మెహ్‌దీ హసన్ మీరాజ్ తలో వికెట్ తీసారు.

Sri Lanka vs Bangladesh

అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 42 ఓవర్లలో 3 వికెట్లకు 264 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. ఓపెనర్ తంజిద్ హసన్(88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లతో 84), లిటన్ దాస్(56 బంతుల్లో 10 ఫోర్లతో 61),మెహ్‌దీ హసన్ మీరాజ్(64 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 67 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు. లంక బౌలర్లలో లాహిరు కుమారా, దునిత్ వెల్లలాగే, దుషన్ హేమంత తలో వికెట్ తీసారు.

ఇక అఫ్గానిస్థాన్, సౌతాఫ్రికా జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా జరగాల్సిన వామప్ మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోయింది.

Story first published: Friday, September 29, 2023, 22:37 [IST]
Other articles published on Sep 29, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+