Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన పాకిస్థాన్!

PAK vs SA: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసిన పాకిస్థాన్.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన ఉత్కంఠపోరులో పాకిస్థాన్ వికెట్ తేడాతో ఓటమిపాలైంది.

సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్‌ చేజార్చుకుంది. ఆఖరి వికెట్ తీయలేక ఓటమికి తల వంచింది. సౌతాఫ్రికా టెయిలెండర్ కేశవ్ మహారాజ్ పాక్ విజయానికి అడ్డుగా నిలిచాడు. చివరి వికెట్‌కు 11 పరుగులు జోడించి సౌతాఫ్రికా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.

PAK vs SA: వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా నాలుగో ఓటమిని చవిచూసిన పాకిస్థాన్.. సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది. సౌతాఫ్రికాతో శుక్రవారం జరిగిన ఉత్కంఠపోరులో పాకిస్థాన్ వికెట్ తేడాతో ఓటమిపాలైంది. సునాయసంగా గెలవాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్‌కు టెయిలెండర్ కేశవ్ మహారాజ్ అడ్డుగా నిలిచాడు. చివరి వికెట్‌కు 11 పరుగులు జోడించి సౌతాఫ్రికా విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 46.4 ఓవర్లలో 270 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(65 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), సౌద్ షకీల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/43) మూడు వికెట్లు తీయగా.. టబ్రైజ్ షంసీ(4/60) నాలుగు వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్ కోయిట్జీ(2/42)కి రెండు వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(93 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. చివర్లో కేశవ్ మహరాజ్(21 బంతుల్లో 7 నాటౌట్), షంసీ(4 నాటౌట్) విలువైన పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ(3/45) మూడు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్(2/62), మహమ్మద్ వసీమ్(2/50), ఉసమా మిర్(2/45) రెండేసి వికెట్లు పడగొట్టారు. వన్ సైడ్ మ్యాచ్‌లతో బోర్ కొడుతున్న ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. విజయం కోసం ఇరు జట్లు కొదమసింహాల్లా హోరాహోరీగా తలపడ్డాయి. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా.. భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 46.4 ఓవర్లలో 270 పరుగులకు కుప్పకూలింది. కెప్టెన్ బాబర్ ఆజామ్(65 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 50), సౌద్ షకీల్(52 బంతుల్లో 7 ఫోర్లతో 52) హాఫ్ సెంచరీలతో రాణించారు.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సెన్(3/43) మూడు వికెట్లు తీయగా.. టబ్రైజ్ షంసీ(4/60) నాలుగు వికెట్లు పడగొట్టాడు. గెరాల్డ్ కోయిట్జీ(2/42)కి రెండు వికెట్లు దక్కాయి.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన సౌతాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లకు 271 పరుగులు చేసి విజయాన్నందుకుంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్(93 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 91) తృటిలో సెంచరీ చేజార్చుకోగా.. మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేదు.

చివర్లో కేశవ్ మహరాజ్(21 బంతుల్లో 7 నాటౌట్), షంసీ(4 నాటౌట్) విలువైన పరుగులతో విజయంలో కీలక పాత్ర పోషించారు. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ అఫ్రిదీ(3/45) మూడు వికెట్లు తీయగా.. హ్యారీస్ రౌఫ్(2/62), మహమ్మద్ వసీమ్(2/50), ఉసమా మిర్(2/45) రెండేసి వికెట్లు పడగొట్టారు.

వన్ సైడ్ మ్యాచ్‌లతో బోర్ కొడుతున్న ప్రపంచకప్‌లో ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సిన మజాను అందించింది. విజయం కోసం ఇరు జట్లు కొదమసింహాల్లా తలపడ్డాయి. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో సౌతాఫ్రికా.. భారత్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి దూసుకెళ్లింది.

Story first published: Friday, October 27, 2023, 23:43 [IST]
Other articles published on Oct 27, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+