Mohammed Shami బోడి గుండు సెలెబ్రేషన్స్.. అతని కోసమేనట! (వీడియో)
IND vs SL, World Cup 2023: టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ దుమ్మురేపుతున్నాడు. నిప్పులు చెరిగే బంతులతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. టచ్ చేస్తే క్యాచ్.. మిస్ అయితే వికెట్ అన్నట్లుగా ఈ వెటరన్ పేసర్ చెలరేగుతున్నాడు. గురువారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లోనూ 5 వికెట్లు పడగొట్టి ఆల్‌టైమ్ రికార్డు సొంతం చేసుకున్నాడు.
ఐదో వికెట్ పడగొట్టిన అనంతరం మహమ్మద్ షమీ వినూత్నంగా సంబరాలు చేసుకున్నాడు. డ్రెస్సింగ్ రూమ్ వైపు తన గుండును చూపిస్తూ ఏవో సైగలు చేశాడు. షమీ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తలపాగను ఉద్దేశించి షమీ ఈ సంబరాలు చేసుకున్నాడని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు.

మ్యాచ్ అనంతరం శుభ్‌మన్ గిల్.. మహమ్మద్ షమీ సంబరాల వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించాడు. హర్భజన్ సింగ్ కోసం కాదని, భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే కోసం ఆ సైగలు చేశాడని స్పష్టం చేశాడు. విజయానంతరం అధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడిన శుభ్‌మన్ గిల్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
'మహమ్మద్ షమీ చేసిన సైగల మా బౌలింగ్ కోచ్ కోసం. జట్టులో జుట్టు లేకుండా ఉండేది అతనే. అందుకే షమీ బోడిగుండు సైగలు చేశాడు.'అని గిల్ చెప్పాడు. దాంతో అక్కడ నవ్వులు పూసాయి. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన షమీ.. జహీర్ ఖాన్‌ను వెనక్కినెట్టాడు.
మెగా టోర్నీలో మూడోసారి ఐదు వికెట్ల ఘనతను అందుకొని ఈ ఫీట్ సాధించిన మిచెల్ స్టార్క్‌తో సమంగా నిలిచాడు. అంతేకాకుండా ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 3 మ్యాచ్‌లే ఆడిన షమీ.. 22 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 14 వికెట్లు పడగొట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications