For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

World Cup 2023: శుభ్‌మన్ గిల్ సంచలనం.. 12 ఏళ్ల రికార్డు బద్దలు!

World Cup 2023: టీమిండియా స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 2000 పరుగుల మైలురాయిని అందుకున్న బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్ ఈఫీట్ సాధించాడు.

ఈ మ్యాచ్‌లో ట్రెంట్ బౌల్ట్ వేసిన 7వ ఓవర్‌లోనాలుగో బంతిని బౌండరీ బాది వన్డేల్లో 2000 పరుగుల మైలు రాయి అందుకున్నాడు. 38 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ సాధించిన శుభ్‌మన్ గిల్ అత్యంత వేగంగా 2000 పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో హషీమ్ ఆమ్లా 12 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

World Cup 2023: Shubman Gill breaks 12-year-old record, becomes fastest batter to 2000 ODI runs

40 ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగులు పూర్తి చేసుకున్న హషీమ్ ఆమ్లా ఇప్పటి వరకు అగ్రస్థానంలో ఉండగా.. శుభ్‌మన్ గిల్ వెనక్కి నెట్టాడు. అతనితో పాటు 45 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్ సాధించిన జహీర్ అబ్బాస్, కెవిన్ పీటర్సన్, బాబర్ ఆజామ్, రాసీ వాన్ డెర్ డస్సెన్‌లను కూడా గిల్ అధిగమించాడు.

ఈ మ్యాచ్‌లో 5 బౌండరీలతో మంచి టచ్‌లో కనిపించిన శుభ్‌మన్ గిల్(26).. ఫెర్గూసన్ షాట్ పిచ్ బాల్‌కు క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. డారిల్ మిచెల్(127 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 130) సెంచరీతో చెలరేగగా.. రచిన్ రవీంద్ర(87 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 75) హాఫ్ సెంచరీతో రాణించాడు. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(5/54) కివీస్ పతనాన్ని శాసించాడు. కుల్దీప్ యాదవ్(2/73) రెండు వికెట్లు తీయగా.. బుమ్రా(1/45), సిరాజ్(1/45) తలో వికెట్ దక్కించుకున్నారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన భారత్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(46), శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 71 పరుగులు జోడించిన అనంతరం రోహిత్, శుభ్‌మన్ గిల్ 5 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. ఈ పరిస్థితుల్లో ధాటిగా ఆడిన శ్రేయస్ అయ్యర్(33)ను ట్రెంట్ బౌల్ట్.. షార్ట్ పిచ్ బాల్‌తో బోల్తా కొట్టించాడు. దాంతో భారత్ 128 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది.

క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్(9 బ్యాటింగ్), కోహ్లీ(24 బ్యాటింగ్) నిలకడగా ఆడుతున్నారు.

Story first published: Sunday, October 22, 2023, 20:34 [IST]
Other articles published on Oct 22, 2023
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+