World Cup 2023: నీకే ఆడరాదు.. నీ ముఖానికి ట్యుటోరియల్ అవసరమా?
World Cup 2023: టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌పై అభిమానులు మండిపడుతున్నారు. వరల్డ్ కప్ 2023లో ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన అయ్యర్.. స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడం లేదు. పేలవ ప్రదర్శనతో వరుసగా విఫలమయ్యాడు. 6 మ్యాచ్‌ల్లో 134 పరుగులు మాత్రమే చేశాడు.
శ్రేయస్ అయ్యర్ దారుణ వైఫల్యం కంటే అతను ఔటైన విధానమే అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది. 6 మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు షార్ట్ పిచ్ బాల్‌కే వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్ క్రీజులోకి రాగానే బౌలర్లు బౌన్సర్లతో అతనిపై అటాక్ చేస్తున్నారు. దాంతో పుల్ షాట్ ఆడే ప్రయత్నంలో అయ్యర్ ఔటవుతున్నాడు.

జట్టు ఎలాంటి పరిస్థితుల్లో ఉందనే విషయాన్ని పట్టించుకోకుండా.. ఈగోకు పోయి మూల్యం చెల్లించుకుంటున్నాడు. అతని వైఫల్యం టీమిండియాకు నష్టం చేస్తోంది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్(4) పుల్ షాట్ ఆడబోయే వెనుదిరిగాడు. క్రిస్ వోక్స్ వేసిన షార్ట్ పిచ్ బాల్‌ను పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేసి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. షార్ట్ పిచ్ బాల్స్ ఆడటం అయ్యర్‌కు బలహీనతగా మారింది.
ఈ క్రమంలోనే అతనికి సంబంధించిన ఓ ట్యుటోరియల్ వీడియోను ప్రస్తావిస్తూ అభిమానులు ఆడుకుంటున్నారు. ఆ మధ్య బూస్ట్ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరించిన శ్రేయస్ అయ్యర్.. ప్రమోషన్ వీడియోలో పుల్ షాట్ ఎలా ఆడాలో కుర్రాళ్లకు నేర్పించే ప్రయత్నం చేశాడు. అప్పట్లో ఈ వీడియో అభిమానులను తెగ ఆకట్టుకుంది.
తాజాగా అదే పుల్ షాట్ ఆడరాక విఫలమవుతుండటంతో ఈ వీడియోను షేర్ చేస్తూ నెటిజన్లు అయ్యర్‌పై సెటైర్లు పేల్చుతున్నారు. 'నీకే ఆడరాదు.. నీ ముఖానికి ట్యుటోరియల్ అవసరమా?'అని కామెంట్ చేస్తున్నారు.
ఇక టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ సైతం శ్రేయస్ అయ్యర్‌కు విలువైన సలహా ఇచ్చాడు. ఇగోను పక్కనపెట్టి బ్యాటింగ్ చేయాలన్నాడు.
'మన ఆధీనంలో ఉన్న బంతులను మాత్రమే పుల్ షాట్ ఆడాలనేది క్రికెట్‌లో ప్రాథమిక సూత్రం. షార్ట్ బాల్స్ విషయంలో అయ్యర్ తొందరపడుతున్నాడు. ఇగోకు పోయి ప్రతీ బౌన్సర్‌ను పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతీ బౌలర్ తనపై బౌన్సర్లు సంధిస్తుండటంతో అటాకింగ్‌తో సమాధానం చెప్పాలని అయ్యర్ దూకుడుగా ఆడుతున్నాడు. ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవడం అతనికి చాలా ముఖ్యం.'అని గంభీర్ సూచించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications