World Cup 2023లో సగం మ్యాచ్‌లు చూస్తుండగానే అయిపోయాయి. అభిమానులు ఆశించిన రీతిలో ఈ మెగా టోర్నీ అయితే సాగడం లేదు. వన్‌సైడ్ మ్యాచ్‌లతో ప్రపంచకప్ తీవ్ర బోర్ తెప్పిస్తోంది. ఇప్పటికీ 25 మ్యాచ్‌లు పూర్తవ్వగా ఒక్క మ్యాచ్ కూడా 100 ఓవర్ల పాటు జరగలేదు. ఈ 25 మ్యాచ్‌ల్లో ఒకటి రెండు మినహా.. అన్నీ ఏకపక్షంగానే ముగిసాయి.
లీగ్ దశలో ప్రతీ టీమ్ తొమ్మిదేసి మ్యాచ్ లు ఆడాల్సి ఉండగా.. ఇప్పటికే ఐదేసి మ్యాచ్‌లు ఆడేసాయి. సగం టోర్నీ ముగిసేసరికి పాయింట్స్ టేబుల్‌లో భారత్ అగ్రస్థానంలో నిలవగా.. సౌతాఫ్రికా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టాప్-4లో కొనసాగుతున్నాయి. లీగ్ దశ ముగిసేసరికి టాప్-4లో నిలిచిన జట్లే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.

ఏదైనా అద్భుతాలు జరిగితే తప్ప దాదాపు ప్రస్తుతం టేబుల్ టాప్‌లో ఉన్న నాలుగు జట్లు సెమీస్‌కు వెళ్ళే అవకాశాలే ఎక్కువ... జట్ల వారిగా సెమీఫైనల్ అవకాశాలను పరిశీలిస్తే... ప్రస్తుత టాప్-4 టీమ్స్‌కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
టీమిండియా: ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుత జోష్ చూస్తూ ఉంటే టీమిండియా ఆడాల్సిన మిగతా మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికాతో మ్యాచ్ తప్ప మిగిలిన మూడూ అవలీలగా గెలుస్తోందనిపిస్తోంది. అదే జరిగితే టేబుల్ టాపర్‌గా సెమీఫైనల్ వెళ్లనుంది. చివరి 4 మ్యాచ్‌ల్లో టీమిండియా రెండు గెలిచినా సెమీస్ బెర్త్ ఖరారు అవుతోంది.
సౌతాఫ్రికా: ఈ టోర్నీలో అండర్ డాగ్స్‌గా ఎంటర్ అయ్యి అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతమైన ఆట తీరుతో దూసుకెళ్తున్న సౌతాఫ్రికా.. టేబుల్‌లో సెకండ్ ప్లేస్‌లో ఉంది. ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు సార్లు భారీ స్కోర్ చేసింది. నెదర్లాండ్స్‌తో మాత్రం అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో సౌతాఫ్రికాకు రెండు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి.
భారత్, న్యూజిలాండ్ జట్లతో ఓడినా బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లను ఓడించడం సౌతాఫ్రికా పెద్ద కష్టమేమి కాదు. ఈ నాలుగు మ్యాచ్‌లో ఓడితేనే ఆ జట్టు సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది.
న్యూజిలాండ్: 5 మ్యాచ్‌ల్లో నాలుగు గెలిచిన కివీస్.. భారత్ చేతిలో ఓటమిపాలై మూడో స్థానంలో ఉంది. ఆ జట్టు ప్రస్తుత ట్రాక్ రికార్డ్ చూస్తే నాలుగులో రెండు ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటుతున్న కివీస్‌ను ఓండించడం కష్టమే.
ఆస్ట్రేలియా: ఐదు మ్యాచ్‌లు ఆడిన ఆస్ట్రేలియా మూడు మాత్రమే గెలిచింది. చివరి నాలుగు మ్యాచ్‌ల్లో ఆ జట్టు న్యూజిలాండ్, ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లు ఆడనుంది. ఈ రెండింటిలో ఒకటి గెలిచినా.. బంగ్లా, అఫ్గానిస్థాన్‌లు ఓడించినా ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖాయమవుతోంది.
పాకిస్థాన్: ఇంకా నాలుగు కీలక మ్యాచ్‌లు ఉన్నాయి. ఇంగ్లండ్, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్లతో దాయదీ టీమ్ ఆడాల్సి ఉంది. ఈ నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలవడంతో పాటు మెరుగైన రన్‌రేట్ సాధిస్తేనే ఆ జట్టుకు సెమీస్ బెర్త్ దక్కుతోంది. అఫ్గాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ జట్లు దాదాపు రేసు నుంచి తప్పుకున్నాయి. సంచలన ఫలితాలు నమోదు చేస్తే... అఫ్గాన్‌కు అవకాశం ఉంటుంది.
నాలుగు మ్యాచ్‌ల్లో ఒకటి మాత్రమే గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్.. శ్రీలంకతో కూడా ఓటమి దిశగా సాగుతోంది. ఇంగ్లండ్ కూడా దాదాపు సెమీఫైనల్ రేసు నుంచి తప్పుకున్నట్లే.