Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

World Cup 2023: సౌతాఫ్రికా చేతిలో ఘోర పరాజయం.. డేంజర్ జోన్‌లో న్యూజిలాండ్!

World Cup 2023 semi finals qualification scenarios: వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుసగా మూడో మ్యాచ్‌లో ఓటమిపాలైంది. వరుసగా నాలుగు విజయాలతో పటిష్టంగా కనిపించిన కివీస్ ఒక్కసారిగా ఢీలా పడిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్, పసికూన నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్‌లను ఓడించిన న్యూజిలాండ్.. భారత్, ఆస్ట్రేలియాతో పాటు తాజా సౌతాఫ్రికా చేతిలో ఖంగుతిన్నది. హ్యాట్రిక్ పరాజయాలతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.

సౌతాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు వరకు మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్ 190 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలై నాలుగో స్థానానికి పడిపోయింది. సఫారీల చేతిలో ఎదురైన ఘోర పరాజయం కివీస్ రన్‌రేట్‌ను దెబ్బతీసింది. దాంతో నాలుగు మ్యాచ్‌లే గెలిచిన ఆసీస్ కంటే వెనుకపడిపోయింది.

 World Cup 2023 semi finals chances: New Zealand in Danger Zone after big loss against South Africa

హ్యాట్రిక్ పరాజయాలతో న్యూజిలాండ్ డేంజర్ జోన్‌లో నిలిచింది. సెమీస్ చేరాలంటే చివరి రెండు మ్యాచ్‌ల్లో ఆ జట్టు తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న న్యూజిలాండ్.. తదుపరి మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌తో(నవంబర్ 4న), శ్రీలంకతో నవంబర్ 9న తలపడనుంది.

ఈ రెండింటిలో గెలిస్తే 12 పాయింట్లతో సెమీస్ బెర్త్ ఖాయమవుతోంది. అలా కాదని ఒక్క మ్యాచ్‌లో ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఒక్క మ్యాచ్ గెలిస్తే న్యూజిలాండ్‌కు 10 పాయింట్లే దక్కుతాయి. అప్పుడు ఆస్ట్రేలియా, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ ఇతర మ్యాచ్‌ల్లో ఓడిపోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ తమ చివరి మూడు మ్యాచ్‌ల్లో కనీసం రెండు ఓడిపోవాల్సి ఉంటుంది. అలాకాకుండా ఈ రెండు జట్లు ఒక్కటి గెలిచినా.. రన్ రేట్ కీలకం అవుతోంది.

పాకిస్థాన్‌తో గెలవడం న్యూజిలాండ్‌కు కాస్త కష్టమే అయినా.. శ్రీలంకతో సునాయసంగా గెలుస్తోంది. ప్రస్తుతం న్యూజిలాండ్‌కు సెమీస్ చేరేందుకు 60 శాతం అవకాశాలు ఉన్నాయి. చివరి రెండు మ్యాచ్‌లు గెలవడం ఆ జట్టుకు చాలా కీలకం.

బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 357 పరుగులు చేసింది. క్వింటన్ డికాక్(116 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114), రాసీ వాన్ డెర్ డస్సెన్(118 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 133) సెంచరీలతో చెలరేగగా.. డేవిడ్ మిల్లర్(30 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53) హాఫ్ సెంచరీతో రాణించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/77) రెండు వికెట్లు తీయగా.. ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ నీషమ్‌లకు తలో వికెట్ దక్కింది.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన న్యూజిలాండ్ ఓవర్లలో పరుగులకు కుప్పకూలింది. కేశవ్ మహరాజ్(4/46), మార్కో జాన్సెన్(3/31) న్యూజిలాండ్ పతనాన్ని శాసించగా.. కగిసో రబడా(1/16), గెరాల్డ్ కోయిట్జీ(1/41) తలో వికెట్ తీసారు. న్యూజిలాండ్ బౌలర్లలో గ్లేన్ ఫిలిప్స్(49 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 60 నాటౌట్) ఒంటరి పోరాటం చేయగా.. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. విల్ యంగ్(33), డారిల్ మిచెల్(24) మినహా అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.

Story first published: Wednesday, November 1, 2023, 22:45 [IST]
Other articles published on Nov 1, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+